నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల ఐదు నుంచి 8వ తేదీ వరకు నిర్వహించనున్న నిర్మల్ ఉత్సవాల ఏర్పాట్లను జిల్లా అదనపు కలెక్టర్ కిషోర్ కుమార్ గురువారం పరిశీలించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు అవసరమైన ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. స్టాళ్లు నిర్మించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డి ఆర్ డి ఓ విజయలక్ష్మి, క్రీడల శాఖ అధికారి శ్రీకాంత్ రెడ్డి, తాహసిల్దార్ రాజు, తదితరులు పాల్గొన్నారు.