హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈ నెల 28 వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ముందుగా ప్రకటించిన గడువు ఈ నెల 18వ తేదీతో ముగియనుంది. అయితే వరుస సెలవులు, విద్యార్థల వివరాలు ఆన్లైన్లో నమోదు చేయడంలో తలెత్తుతున్న సాంకేతిక సమస్యల నేపథ్యంలో పరీక్ష ఫీజు చెల్లింపు గడువును పది రోజులు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆలస్య రుసుము రూ.50తో డిసెంబర్ 10 వరకు, ఆలస్య రుసుము రూ.200తో డిసెంబర్ 19 వరకు, ఆలస్య రుసుము రూ.500తో డిసెంబర్ 30 వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం కల్పించారు.