26-03-2025 11:32:28 PM
కామారెడ్డి జిల్లా జుక్కల్ అధికారులపై వేటు..
కామారెడ్డి (విజయక్రాంతి): పదవ తరగతి గణిత పరీక్ష పేపర్ ప్రశ్నలు బయటకు వచ్చిన అభియోగం మేరకు పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అధికారులను సస్పెండ్ చేశారు. బుధవారం జరిగిన గణిత పరీక్ష జుక్కల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పరీక్షా కేంద్రం నుండి పరీక్ష ప్రశ్నాపత్రంలోని కొన్ని ప్రశ్నలను కాగితంపై రాసి బయటకు పంపించిన ఘటనపై సామాజిక మాధ్యమాలలో బయటకు వచ్చిన సందర్భముగా బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, జిల్లా విద్యాశాఖ అధికారి రాజు, జుక్కల్ తాహసిల్దార్, మండల పంచాయతీ అధికారి, జుక్కల్, మండల విద్యాధికారి జుక్కల్ మండల విద్యాశాఖ అధికారి, పోలీసు ఉన్నత అధికారులు విచారణ జరిపారు.
పరీక్ష కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న చీఫ్ సూపర్డెంట్ డోంగ్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ సునీల్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్ మద్నూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ అసిస్టెంట్ భీమ్, ఇన్విజిలేటర్ సోపూరు ఎంపీపీఎస్ ఎస్జీటీ ఉపాధ్యాయురాలు దీపికను విధుల నుంచి సస్పెండ్ చెయ్యడం జరిగిందని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు బుధవారం రాత్రి విజయక్రాంతితో తెలిపారు.