21-03-2025 10:18:03 PM
సెయింట్ మేరీస్ పరీక్షా కేంద్రంలో చోటు చేసుకున్న ఘటన
విద్యార్థినికి తెలుగు 01T,02T(A) కి బదులు 03T ప్రశ్నాపత్రం అందజేత
న్యాయం చేయాలని విద్యార్థిని భవ్య శ్రీ వేడుకలు
బెల్లంపల్లి,(విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో శుక్రవారం ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల భవ్య శ్రీ అనే విద్యార్థినికి 10వ తరగతి మొదటి రోజు తెలుగు పరీక్ష పత్రం తారుమారైంది. బెల్లంపల్లి మండలంలోని చాకేపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్లో పదవ తరగతి చదివిన సొప్పరి భవ్య శ్రీ (హాల్ టికెట్ నెంబర్ 2503109168) అనే విద్యార్థిని కి బెల్లంపల్లి లోని సెయింట్ మేరీస్ ఇంగ్లీష్ మీడియం లో సెంటర్ పడింది. హాల్ టికెట్ లో సూచించిన విధంగా విద్యార్థిని భవ్య శ్రీ కి 01T /02T(A) తెలుగు ప్రశ్నాపత్రం ఇవ్వాల్సి ఉండగా ఇన్విజిలేటర్ తప్పిదంతో మోడల్ స్కూల్ విద్యార్థులకు అందజేయాల్సిన 03T (A) తెలుగు ప్రశ్నాపత్రం ఇచ్చారు.
తెలుగు పాఠ్యాంశం ఒకటే కావడంతో 03T(A) ప్రశ్న పత్రాన్ని విద్యార్థిని భవ్య శ్రీ పెద్దగా గుర్తించలేకపోయింది. కానీ ప్రశ్నాపత్రం లోని ప్రశ్నలు సులువుగా అర్థం కాకపోవడంతో పరీక్ష రాసేందుకు విద్యార్థిని భవ్య శ్రీ ఇబ్బంది పడింది. పరీక్ష రాసి బయటికి వచ్చాక తన స్నేహితులను తెలుసుకోవడంతో ప్రశ్నాపత్రం మారినట్లు గమనించింది. దీంతో ఆందోళన చెందుతూ ఇంటికి చేరిన విద్యార్థిని భవ్య శ్రీ మొదటి రోజు తెలుగు పరీక్ష ప్రశ్నాపత్రం మారిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పుకొని బాధపడింది. ఇన్విజిలేటర్ తప్పిదం వల్ల మోడల్ స్కూల్ విద్యార్థులకు అందాల్సిన తెలుగు ప్రశ్నపత్రం తనకి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. అందరిలాగే తనకు 01T /02T (A) తెలుగు ప్రశ్నాపత్రం అందితే పరీక్ష మరింత బాగా రాసే అవకాశం భవ్య శ్రీ భావోద్వేగానికి గురైంది. జిల్లా విద్యాశాఖ అధికారులు తనకు న్యాయం జరిగేలా చూడాలని వేడుకుంది.