27-03-2025 12:00:00 AM
హీరో నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబోలో తెరకెక్కుతున్న రెండో చిత్రం ‘ది ప్యారడైజ్’. హైదరాబాద్ హిస్టారి కల్ బ్యాక్‌డ్రాప్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌ను ఎస్‌ఎల్‌వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇంగ్లిష్, స్పానిష్ సహా 8 భాషల్లో విడుదల చేస్తామని ముందే ప్రకటించారు దర్శక నిర్మాతలు. ఇటీవల ‘రా స్టేట్‌మెంట్’ పేరుతో విడుదల చేసిన టీజర్‌కు విశేష స్పందన వచ్చింది.
ఇక తాజాగా ఈ సినిమా విడుదల తేదీని సైతం ప్రకటించేశారు. 2026, మార్చి 26న.. అంటే సరిగ్గా 36౪ రోజుల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రణభూమిలో తుపాకీని పట్టుకుని ఉన్న నాని పవర్‌ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటో గ్రఫీ: జీకే విష్ణు; సంగీతం: అనిరుధ్ రవిచందర్.