calender_icon.png 12 December, 2024 | 7:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ మహిళా మంత్రులు అరెస్ట్

12-12-2024 04:39:35 PM

హైదరాబాద్: తాండూర్ గిరిజన హాస్టల్‌లో విషాహార బాధిత పిల్లలను పరామర్శించడానికి వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పార్టీ సీనియర్ నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. పసిబిడ్డలకు కనీసం ఆహారం పెట్టలేని అమానవీయ ప్రభుత్వం, అరెస్టుల పేరుతో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆరోపించారు. ప్రజా పాలన అంటే ప్రజా ప్రతినిధులను అక్రమంగా అరెస్టు చేయడమేనా? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఆడబిడ్డలను పరామర్శించే ప్రయత్నాన్ని అడ్డుకుంటున్న ఈ అమానవీయ ప్రభుత్వ వైఖరిని ఆయన ఖండించారు. ప్రభుత్వ బాధ్యతను గుర్తుచేస్తున్న ప్రతిపక్షాన్ని అడ్డుకోవడం కాకుండా, పసిబిడ్డలకు పోషకాహారం అందించడం, సరైన సౌకర్యాలు కల్పించడంపై దృష్టి పెట్టడం మంచిదని హితువు పలికారు. మా ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తాండూరులోని ట్రైబల్ వెల్ఫేర్ వసతి గృహంలో అస్వస్థతకు గురైన విద్యార్థినిలను పరామర్శించడానికి వెళుతున్న మాజీ మంత్రులు సత్యవతి రాథోడ్ సబితా ఇంద్రారెడ్డి లను వికారాబాద్ లో అడ్డుకున్న పోలీసులు అరెస్టు చేసి డిటిసిపికి తరలించారు.