calender_icon.png 14 November, 2024 | 7:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పురుగులు లేని అన్నం కోసం విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి

12-11-2024 02:03:37 PM

వేములవాడ,(విజయక్రాంతి): ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు రోడ్డెక్కాల్సిన దుస్థితి ఏర్పాడిందని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని హరీశ్ రావు మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలను అందుకున్నారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ... గురుకులాలు అధ్వాన్న స్థితికి చేరితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చీమకుట్టినట్లు కూడాలేదన్నారు. రేవంత్ రెడ్డి పాలనలో గురుకులాల ఖ్యాతి పాతాళానికి దిగజార్చారని హరీశ్ రావు మండిపడ్డారు. అసమర్థ పాలనకు వెల్ధండ గురుకుల విద్యార్థుల నిరసన మరో నిదర్శనామని, ఇకానైన ప్రభుత్వం స్పందించి గురుకులాల్లో సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం చేసిన తప్పులకు రైతులకు శిక్ష ఎందుకు..? అని, మీ తప్పులకు రైతులు వడ్డీ భారం ఎందుకు భరించాలని హరీశ్ రావు ప్రశ్నించారు. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ అసంపూర్తిగా చేశారని, రూ.2 లక్షలలోపు ఉన్న లక్షలాది రైతులకు రుణమాఫీ కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. కుంటి సాకులతో రైతులకు రుణమాఫీ చేయలేదని, తక్షణమే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు వెల్లడించారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై మాట్లాడే నైతిక హక్కు సీఎం రేవంత్ రెడ్డి కి లేదని, సాగు రంగం, రుణమాఫీ సహా ఏ రంగంపైనైనా చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు, రైతులు రైతుబంధు కోల్పోయారని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.