13-02-2025 06:13:34 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా లక్ష్మణ్ చందా మండలంలోని పుట్టపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ రాజు తల్లి భూమవ్వ ఇటీవల మృతి చెందడంతో గురువారం మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరామర్శించారు. జరిగిన సంఘటన పట్ల విచారణ వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రఘునందన్ రెడ్డి, ధర్మాజీ శ్రీనివాస్, నాలం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.