calender_icon.png 23 December, 2024 | 9:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎల్బీస్టేడియం వద్ద టవర్ ఎక్కిన మాజీ హోంగార్డు

21-12-2024 12:17:41 PM

హైదరాబాద్: ఎల్బీస్టేడియం వద్ద  మాజీ హోంగార్డు టవర్ ఎక్కాడు. ఉమ్మడి రాష్ట్రంలో వీరంజనేయులు విధులు నిర్వహించాడు. అప్పట్లో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నామని అప్పటి ప్రభుత్వం మాపై కక్షగట్టి 250 మంది హోంగార్డులను విదుల నుండి తొలగించారు. అధికారంలోకి రాగానే మమల్ని విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంవత్సరం గడుస్తున్న పట్టించుకోవడం లేదని ఆరోపించాడు. హైదరాబాద్ లోని పలు పోలీస్ స్టేషన్లలో వీరాంజనేయులు విధులు నిర్వహించాడు. తమ గురించి అసెంబ్లీలో చర్చించి తొలగించిన 250మంది హోంగార్డు లను విధుల్లోకి తీసుకొని, తమను ఆదుకోవాలని వీరాంజనేయులు డిమాండ్ చేస్తున్నాడు.