22-02-2025 12:18:12 AM
చెక్కులు అందజేసిన పోలీస్ కమిషనర్
ఖమ్మం, ఫిబ్రవరి 21 (విజయక్రాంతి) : కొణిజర్ల పోలీస్ స్టేషన్ లో భాధ్యతలు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో మరణించిన హెడ్ కానిస్టేబుల్ఇ . లోకేశ్, అదేవిధంగా అనారోగ్యంతో మరణించిన ఏఆర్ కానిస్టేబుల్ ఐ.బాలరాజు కుటుంబ సభ్యులకు ఒక్కో కుటుంబానికి రూ.8 లక్షల చొప్పున భద్రత ఎక్సిగ్రేసియా చెక్కు ను శుక్రవారం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాఖపరంగా ఎటువంటి సహాయ సహకారాలు అందించేందుకైన పోలీస్ అధికారులు అందుబాటులో వుంటారని అన్నారు. పోలీసు కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని భరోసా కల్పించారు.