ధర్మసమాజ్ పార్టీ హుజురాబాద్ మండల ప్రధాన కార్యదర్శి మంద రాజు...
హుజురాబాద్ (విజయక్రాంతి): మామునూరు వద్ద ఆదివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో క్షత్రగాత్రులైన వారికి మెరుగైన వైద్యం అందించాలని మంద రాజు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో మందరాజు మాట్లాడుతూ... మధ్యప్రదేశ్ రాష్ట్రం భూపాల్లోని గరీబ్ నగర్ కు చెందిన నువూరు సంతోష్ చౌహాన్ కుటుంబానికి ప్రభుత్వం 25 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని భారీ వాహనాలకు అధికలోడు వేసుకునేందుకు అనుమతి ఇవ్వద్దని రోడ్డు ప్రమాద సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తున్న ప్రమాదాలు జరుగుతున్నాయని, ఈ విషయంలో కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని, డ్రైవర్లకు నెలకు ఒక్కసారైనా రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహన కార్యక్రమాలు లాంటివి ఏర్పాటు చేయాలన్నారు.