calender_icon.png 20 January, 2025 | 11:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎక్స్‌గ్రేషియా నిధులు విడుదల చేయాలి

20-01-2025 12:00:00 AM

సీఎం రేవంత్, మంత్రి శ్రీధర్‌కు ఎన్నారై సెల్ విజ్ఞప్తి

జగిత్యాల, జనవరి 20 (విజయక్రాంతి): ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి మృతిచెందిన వ్యక్తుల కుటుంబాలకు ప్రభుత్వ తరఫున అందించే నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని కాంగ్రెస్ ఎన్నారై సెల్ నాయకులు మంద భీంరెడ్డి, నంగి దేవేందర్‌రెడ్డి కోరారు.

సింగపూర్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి శ్రీధర్‌బాబులను ఆదివారం కలిసి వినతిపత్రం అందజేశారు. 94 మంది గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున మొత్తం రూ.4.70 కోట్ల  నిధులు విడుదల చేయాలని కోరారు.