calender_icon.png 14 March, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజకీయ దిగజారుడుకు నిదర్శనం

14-03-2025 12:56:16 AM

మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

తలకొండపల్లి,మార్చి 13(విజయక్రాంతి):గట్టుఇప్పలపల్లి మండలం ఏర్పాటుకు అదికారంలో ఉన్నప్పుడు అడ్డుపడి అదికారం కోల్పోగానే మద్దతు తెలపడం మాజీ ఎమ్మెల్యే గుర్ఖా జయపాల్ యాదవ్ రాకీయ దిగజారుడుకు నిదర్శనమని మండల కాంగ్రేస్ పార్టీ నాయకులు మాజీ వైస్ ఎంపిపి శ్రీనివాస్ రెడ్డి,రేన్ రెడ్డి,డేవిడ్ లు తీవ్రంగా దుయ్యబట్టారు.

తలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు.గట్టుఇప్పలపల్లి గ్రామాన్ని మండల కేంద్రంగా ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వ హయంలో ఎమ్మెల్యే గా ఉన్న జయపాల్ యాదవ్ ను గ్రామస్తులు కోరారు.అప్పుడు మీ గ్రామం మండలంగా ఏర్పాటుకావడం జరుగదని ఖరాఖండిగా చెప్పారని ఆరోపించారు.గ్రామస్తులందరు జేఎసి గా ఏర్పడి గత 270 రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు.

అందులో బాగంగా గురువారం కొంత మంది అందరితో సంప్రదించకుండా అసెంబ్లీ ముట్టడికి కార్యక్రమానికి పిలుపునిచ్చారు.దీంతో పోలీసులు గ్రామస్తులను ముందస్తుగా అరెస్ట్ చేసి పోలిస్ స్టేషన్ కు తరలించారు.పోలిస్ స్టేషన్ కు చేరుకున్న మాజీ ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గ్రామాస్తుల అరెస్ట్ ను ఖండించి వారిని పరమార్శించి మండల ఏర్పాటుకు మద్దతు తెలపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇది మీ స్తాయికి తగునా అని జయపాల్ యాదవ్ ను ఎద్దేవా చేశారు.మండల ఏర్పాటుకు మేము ఎప్పుడు వ్యతిరేకం కాదని చెప్పారు.ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణనారాయణరెడ్డి మండల ఏర్పాటుకు హామీ ఇచ్చినట్లు అబద్దపు ప్రచారం చేస్తున్నారని అన్నారు.ఇలాంటి అబద్దపు ప్రచారాలను మానుకొని అభివృద్దికి సహరించాలని హితువు పలికారు.ఈ సమావేశంలో సొప్పరి శ్రీను,మట్ట అంజయ్య,జక్కుల మల్లేష్ లు పాల్గొన్నారు.