24-02-2025 12:00:00 AM
సూర్యాపేట, ఫిబ్రవరి 2౩ (విజయ క్రాంతి): ఆ కార్యాలయాల్లో పని అంటేనే జనం జంకుతున్న పరిస్థితి. అక్కడికి వెళితే ఎంత భారం మోపుతారో అని బెంబేలెత్తి పోతున్నారు. ఏ చిన్న పనికోసం వెళ్లినా చెయ్యి తడపనిదే ఫైలు ముందుకు కదలదే ఆరోపణలు ఉన్నాయి.
పనికిదగ్గ రేటును ఫిక్స్చేసి, ముక్కుపిండి మరీ వసూలు చేస్తు న్నారని బాధితులు అంటున్నారు. ఎవరైనా ఇదేమని అడిగితే నిబంధనల పేరుతో కాలయాపన చేస్తూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించుకుంటు న్నారనేది జగమెరిగిన సత్యం. ఇది సూర్యాపేట మున్సిపాలిటీ పరిస్థితి.
జనన, మరణ ధ్రువపత్రాలకు....
అవగాహన లోపం, నిరక్షరాస్యత కారణంగా కొందరు జనన ధ్రువపత్రాల ప్రాముఖ్యం గ్రహించరు. ప్రభుత్వ పథకాలు, పిల్లల చదువులు, ఉపాధి, ఉద్యోగ అవకాశాల సమయంలో అవి అవసరమవుతాయి. పిల్లలు పుట్టి ఏడాది దాటినా జనన ధ్రువపత్రంతీసుకోకుంటే తర్వాత ఆర్డీవో నుంచి నాన్‌ఎ్వలులిటీ పత్రం ఇచ్చాక మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి.
వీటితో పనిలేకుండా జనన ధ్రువపత్రం పొందాలంటే దళారులను ఆశ్రయించడం లేదా నిర్వా కార్యాలయంలోని నిర్వహిస్తున్న ఉద్యోగులను సంప్రదిస్తే అవసరాన్ని బట్టి ఒక్కోటి రూ.3-10 వేలకు ఉన్నాయి. ఈ శాఖలో పని చేస్తున్న ఓ అధికారి అక్రమ సంపాదనతో కోట్లు కూడగట్టారని కార్యాలయ సిబ్బందే ఆరోపిస్తున్నారు.
పెన్షన్ విభాగంలోనూ అక్రమాలు...
సూర్యాపేట మున్సిపాలిటీ పెన్షన్ విభాగంలో పనిచేస్తున్న కొందరు సిబ్బంది అక్రమవస్తులకు పాల్పడుతున్నారని ఆరోపణలు గట్టిగా వినబడుతున్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రం జమ్మిగడ్డ కు చెందిన ఓ మహిళ తన భర్త చనిపోవడంతో గత సంవత్సరం జూలైలో వితంతు పెన్షన్ కు దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ఈ కార్యాలయంలో పనిచేస్తున్న సిబ్బంది ఆ మెదరకాస్తును ఆన్లైన్ చేయకుండానే చేసినట్లు నకిలీ దరఖాస్తు ప్రతిని ఆమెకు ఇచ్చి రూ. 3500 తీసుకొని పని అయిపోయిందని పంపించారు. కానీ నేటికీ పెన్షన్ అందకపోవడంతో ఆమె డిఆర్డిఏ కార్యాలయంలో ఇటీవల సంప్రదించగా అది నకిలీ దరఖాస్తు అని తెలపడంతో తిరిగి మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే తప్పు అయినదని ఒప్పుకొని ఆమె డబ్బులను తిరిగి ఇచ్చినట్లు సమాచారం.
మున్సిపాలిటీ పెన్షన్ విభాగంలో అక్రమాలకు ఇదే నిదర్శనం. పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకొని ముడుపులు ముట్ట చేపిన బాధితులు అనేకమంది ఉన్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇంతా జరుగుతున్న కార్యాలయంలో అధికారులు మాత్రం ముడుపుల మత్తులో ఉన్నారని పలువురు ఆరోపిస్తున్నారు.