calender_icon.png 31 October, 2024 | 12:52 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెరిగిందంతా తగ్గింది

23-06-2024 01:41:55 AM

  • రూ.870 దిగిన పసిడి తులం ధర

న్యూఢిల్లీ, జూన్ 22: దాదాపు నెలరోజుల తర్వాత శుక్రవారం భారీగా పెరిగిన బంగారం ధర వెనువెంటనే శనివారమే పడిపోయింది. ప్రపంచ మార్కెట్లో ధర పతనమైన నేపథ్యంలో హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో శనివారం 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.870 క్షీణించి రూ.72,380 స్థాయికి దిగింది. క్రితం రోజు ఇది రూ.810 మేర పెరిగిన సంగతి తెలిసిందే. తాజాగా 22 క్యారెట్ల ఆభరణాల బంగారం తులం ధర రూ.800 తగ్గి రూ. 66,350 వద్దకు చేరింది.

మే నెల మూడోవారంలో స్థానిక మార్కెట్లో పసిడి రూ.75,160 స్థాయికి చేరి కొత్త రికార్డును నెలకొల్పి,  అటుతర్వాత క్రమేపీ రూ.71,000 స్థాయికి పడిపోయిన విషయం విదితమే. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 34 డాలర్ల మేర క్షీణించి 2,335 వద్దకు తగ్గడంతో స్థానిక మార్కెట్లో సైతం ధర దిగివచ్చిందని బులియన్ ట్రేడర్లు తెలిపారు. పుత్తడి బాటలోనే వెండి కూడా తగ్గింది. హైదరాబాద్‌లో వెండి కేజీ ధర రూ.2,000 వరకూ తగ్గి రూ.96,500 స్థాయికి చేరింది. ప్రపంచ మార్కెట్లో ఔన్సు వెండి ధర 4 శాతం క్షీణించి 29.58 డాలర్ల వద్దకు పడిపోయింది.