calender_icon.png 3 February, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంతా ట్రాష్!

03-02-2025 12:37:35 AM

  1. రైతుల ఆందోళన వృథా... రూ. 200 ప్రకటన మైకుకే పరిమితం 
  2. కమిషన్ ఏజెంట్ రూ 100, కొనుగోలు దారుడు రూ 100 పెంచాలని నిర్ణయం 
  3. ఇరువురు పెంచకుండా తర్వాత ఇస్తామంటూ సర్ది చెప్పిన కమిషన్ ఏజెంట్లు 
  4. రైలు ఆపి ఆందోళన చేసినా.. అందని పెంపు డబ్బులు 

మహబూబ్ నగర్, ఫిబ్రవరి 2 (విజయ క్రాంతి): పల్లికీ గిట్టుబాటు ధర రావడం లేదని.. పెట్టిన పెట్టుబడి రాక అప్పుల పాలవుతున్నామని... గడిచిన మంగళవారం రైతులు రోడ్లపైకి వచ్చి భారీ ఎత్తున ఆందో ళన చేపట్టారు. బోయపల్లి రైల్వే గేటు పైకి వచ్చి పట్టాలపై నిరసన తెలిపి కర్నూలు నుంచి హైదరాబాద్ వెళుతున్న గూడ్స్ రైలు సైతం ఆపి తమ ఆవేదనను అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలిసేలా మొర పెట్టుకు న్నారు.

ఈ క్రమంలో పోలీసులు స్పందించి రైతులకు అప్పజెప్పి వ్యవసాయ మార్కెట్ యార్డ్ దగ్గరికి తీసుకు వెళ్లిన విషయం విధితమే. కమిషన్ ఏజెంట్లు, కొనుగోలు దారులతో మార్కెట్ కమిటీ చైర్మన్ బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ అధికారి బాలమణి దాదా పు గంటన్నరకు పైగా చర్చలు జరిపి టెండర్ వేసిన ధర కంటే రూ. 200 అధికంగా అందజేస్తామని మార్కెటింగ్ యార్డు లో ఉన్న మైకు ద్వారా ప్రకటించారు.

ప్రకటిం చింది అంట అంత ట్రాష్ గా మిగిలిపో యింది. అసహనం వ్యక్తం చేస్తూనే రైతులు ఇక ఏం చేస్తాం వచ్చింది చాలు అంటూ వెనుతిరిగారు. కాగా పెంచుతున్నాం ప్రతిఘ టలకు అని పెంచిన డబ్బులు మాత్రం రైతు లకు అందలేదు. అప్పుడు ఇప్పుడు అంటూ కమిషన్ ఏజెంట్లు రైతులకు మభ్యపెడుతూ వస్తుండ్రు అంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 

ప్రతిఘటించి ఫలితమేముంది...?

రైతులు తమ ఆవేదనను గుర్తించి పల్లి ధరను పెంచాలని ప్రతిఘటించినప్పటికీ అధికారులు రైతులను ప్రలోభాల గురిచేసి ఆందోళన విరమింప చేసి ఆ తర్వాత ఏజెం ట్లు ఇస్తారు? కొనుగోలుదారులు పెంచు తారు? అంటూ కాలం గడుపుతున్నారు తప్ప ఇటీవల గడిచిన బుధవారం టెండర్ అయి ప్రక్రియ అంత పూర్తయినప్పటికీ నేటికీ ఎంతోమంది రైతులకు పెంచిన డబ్బులు చెల్లించలేని పరిస్థితి నెలకొంది. 

మేము ఒక 100, కొనుగోలు దారులు మరో 100

పల్లి విక్రయంలో కీలక పాత్ర పోషిస్తున్న ఓ కమిషన్ ఏజెంట్ ను వివరణ కోరగా మార్కెట్ యార్డ్ నుంచి గడచిన బుధవారం రైతులు చేసిన ఆందోళన కారణంగా వేసిన టెండర్ ధరల రూ 4500 కంటే తక్కువ ధర వచ్చిన పల్లికి క్వింటాల్ కు  కమిషన్ ఏజెంట్ 100, కొనుగోలుదారులు 100 మొత్తం రూ 200 పెంచాలని చెప్పడం జరిగింది. కాగా ఆ ప్రక్రియ జరుగుతుంది. వేసిన టెండర్ల కాడికి అయితే ఇప్పటివరకు రైతుకు డబ్బులు చెల్లించడం జరిగింది. 

టెండర్‌లో వచ్చిన ధరనే ఇచ్చిండ్రు

కొంతలో కొంతైనా ధర పెరిగితే డబ్బు లు ఎక్కువగా వస్తాయి అని ఆశించాము. కానీ టెండర్‌లో వేసిన ధర మా త్రమే కమిషన్ ఏజెంట్ లెక్కచేసి ఇవ్వడం జరిగింది. ఏమన్నా అంటే రూ 4500 లోపు టెండర్ పోయిన వాటికి మాత్రమే 200 పెంచాలని చెప్పడం జరిగిందని చెబుతుండు. వారికి కూడా పెంచి ఇవ్వలే దు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆందోళన చేస్తే 200 పెంచుతామని చెప్పి పెంచి ఇవ్వలేదు. 

 రామ కొండ, పల్లి రైతు

అందరికీ ఇవ్వమని చెప్పడం జరిగింది

రైతులందరికీ గడచిన మంగళ వారం చేసిన ఆందోళనలో టెండర్ వేసిన ధరల కంటే 200 పెంచి ఇవ్వా లని అందరిని ఒప్పించడం జరిగింది. అందరూ ఇస్తారు. రైతులకు అన్యా యం జరగకుండా చూస్తాం. 

 బెక్కరి అనిత మధుసూదన్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్, 

మహబూబ్ నగర్