calender_icon.png 10 January, 2025 | 4:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రంగనాథ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధం..!

09-01-2025 07:16:48 PM

నాగర్ కర్నూల్ (విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా శ్రీపురంలో కొలువైన శ్రీ గోదా సమేత రంగనాథ స్వామి ఆలయంలో శుక్రవారం జరిగే వైకుంఠ ఏకాదశి వేడుకలకు సర్వం సిద్ధమైంది. జిల్లాలోని అత్యంత పురాతన వైష్ణవ ఆలయాల్లో ఒకటైన ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజున తెల్లవారుజామున 5 గంటల 30 నిమిషాలకు ఉత్తర ద్వార దర్శనం ప్రారంభం లాంఛనంగా కాబోతుంది. అంతకు ముందే విశేష పూజలు, గరుడ పల్లకి సేవ ద్వారా స్వామివారు ఉత్తర ద్వారం వద్దకు చేరుకోనున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్(Collector Badhavat Santhosh), జిల్లా న్యాయమూర్తులు, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్ తో సహా అనేక మంది ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయ నేతలు, భక్తులు పెద్ద ఎత్తున స్వామి వారిని దర్శించుకునేందుకు రానున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఇందుకు పెద్ద ఎత్తున ఏర్పాటు చేశామన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఆలయాన్ని విద్యుత్ కాంతలతో తీర్చిదిద్దారు. ఏడాదికి ఒకరోజు మాత్రమే తెరుచుకునే ఉత్తద్వారాన్ని రంగురంగుల పూలతో అలంకరించారు. వేలాదిగా వచ్చే భక్తులకు సరఫరా చేసేందుకు ప్రసాదం సిద్ధం చేయనున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.