calender_icon.png 21 March, 2025 | 5:44 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

21-03-2025 01:58:24 AM

పరీక్ష సెంటర్లు 50, పరీక్ష రాస్తున్న విద్యార్థులు 8632 మంది ఆల్ ది బెస్ట్ చెప్పిన కలెక్టర్

యాదాద్రి భువనగిరి మార్చి 20 ( విజయ క్రాంతి ఈనెల 21 నుండి జరగబోవు పదవ తరగతి పరీక్ష కు అన్ని ఏర్పాట్లు  పూర్తి చేయడం జరిగిందని యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంత రావు అన్నారు. గురువారం రోజు మండల విద్యాధికారులు, పరీక్ష సెంటర్ల చీఫ్ సూపరింటెండెంట్లు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లతో   కలెక్టరు  హనుమంతరావు  జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించారు.

జిల్లా కలెక్టర్ మాట్లడుతూ జిల్లా లో పదవ తరగతి పరీక్ష కు 8632 మంది విద్యార్థినీ విద్యార్థులు పరీక్షలు హాజరవుతున్నారు. .50సెంటర్ లు ఏర్పాటు చేయడం జరిగిందని, అందుకుగాను చీఫ్ సూపర్డెంట్లు 50 మంది, డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు 50 మంది, ఇన్విజిలేటర్స్  576 మంది  ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. పదవ తరగతి  తరగతి పరీక్షలు సజావుగా జరగడానికి అన్ని ఏర్పాటు పూర్తి చేయడం జరిగిందని .

ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పదవ తరగతి పరీక్షలు నిర్వహించేలా  చీఫ్ సూపరింటెండెంట్లు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లకు తగిన సూచనలు ఇచ్చారు.  ఈ మీటింగ్ లో జిల్లా విద్యాశాఖాధికారి సత్యనారాయణ , అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ రఘురాం రెడ్డి గారు, వివిధ మండలాల విద్యాధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లు మరియు డిపార్ట్మెంటల్ ఆఫీసర్లు పాల్గొన్నారు