calender_icon.png 31 March, 2025 | 9:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టెన్త్ పరీక్షలకు సర్వం సిద్ధం

21-03-2025 12:27:04 AM

నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం

ముషీరాబాద్, మార్చి 20: (విజయక్రాంతి): 10వ తరగతి పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ముషీరాబాద్ విద్యామండలి పరిధిలో మొత్తం 23 పరీక్షా కేంద్రాలను ఎంపిక చేశారు. పరీక్షా కేంద్రాలలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యాశాఖ అధికారులు ఏర్పాటు చేశారు. మండల పరిధిలో 4807 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.

అందులో 7 ప్రభుత్వ ఉన్నత పాఠశాలలకు చెందిన విద్యార్థులు 332 మంది పరీక్షలు రాయనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. విద్యార్థులు గంట ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు బందోబస్తు సైతం ఏర్పాటు చేశారు.

ముఖ్యంగా పరీక్షా తరగతి గదుల్లో గాలి, వెలుతురు, మం చినీటి సౌకర్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. విద్యార్థులు టెన్షన్ కు లోనుకావద్దు శ్రావణ్ కుమార్.. *ముషీరాబాద్ విద్యామండలి డిప్యూటీ ఈవో విద్యార్థులు టెన్షన్ కు లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలి. గంట ముందే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలి. ప్రశ్నాపత్రాన్ని క్షున్నంగా చదివి సమాధానాలు రాయాలి. సాధారణ పరీక్షల వలే దైర్యంతో పరీక్షలు రాసి మంచి మార్కులు తెచ్చుకోవాలి.