15-03-2025 08:35:35 PM
హుజురాబాద్ (విజయక్రాంతి): కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని స్థానిక హై స్కూల్ క్రీడా మైదానంలో ఆదివారం నుండి ఎనిమిదవ సీనియర్ తెలంగాణ రాష్ట్ర స్థాయి మెన్ హాకీ ఛాంపియన్ షిప్ పోటీలు హుజురాబాద్ హాకీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు హుజురాబాద్ టోర్నమెంట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ తోట రాజేంద్రప్రసాద్, అధ్యక్షుడు కొలిపాక శ్రీనివాస్ తెలిపారు. 16, 17, 18, తేదీలలో టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు, ఈ టోర్నమెంట్ కి రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల జట్లు పాల్గొంటున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి. బిసి సంక్షేమ, రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడితల ప్రణవ్ బాబు వస్తున్నట్లు తెలిపారు.
జెర్సీల ఆవిష్కరణ..
ఎనిమిదవ తెలంగాణ హాకీ మెన్ ఛాంపియన్ షిప్ టోర్నమెంట్ లో పాల్గొనే కరీంనగర్ జట్టు క్రీడాకారులకు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ సర్దార్ సురేందర్ సింగ్, జెర్సీలు ఆవిష్కరించి క్రీడాకారులకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఈ టోర్నమెంట్లో కరీంనగర్ జట్టు అత్యుత్తమ ప్రదర్శన కనబరిచి టోర్నమెంట్ విజేతగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ జాయింట్ సెక్రెటరీ కళ్యాణి సర్దార్, కరీంనగర్ జిల్లా హాకీ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు బండ శ్రీనివాస్, హుజురాబాద్ క్లబ్ సెక్రటరీ గంగిశెట్టి ఉమామహేశ్వర్, హుజరాబాద్ హాకీ క్లబ్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ వేముల రవికుమార్, సీనియర్ క్రీడాకారులు, లక్ష్మీనారాయణ గుడ్డేలుగుల సమ్మయ్య, చింత శ్రీనివాస్, మౌటం రవీందర్, భూసారపు శంకర్, టి శ్రీనివాస్, సాయి కృష్ణ, రాజేష్, తిరుపతి, శ్యామ్, విక్రమ్, రాజేష్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.