calender_icon.png 3 April, 2025 | 3:38 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ధాన్యం కొనుగోలుకు సర్వం సిద్ధం

31-03-2025 12:00:00 AM

జిల్లావ్యాప్తంగా 414 కేంద్రాల ఏర్పాటు 

సంబంధిత అధికారులతో ఇప్పటికే కలెక్టర్ సమీక్ష 

వనపర్తి, మార్చి 30 ( విజయక్రాంతి ),:  యాసంగి సీజన్ కు సంబంధించి  ఏప్రిల్ 01 వ తేదీ నుండి వనపర్తి జిల్లా వ్యాప్తంగా వరి కోతలు ప్రారంభం అవుతున్న నేపథ్యంలో పంట ను తీసుకుని కొనుగోలు కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కలెక్టర్ ఆదర్శ్ సురభి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

ధాన్యం సేకరణకు సంబంధించి సంబంధిత అధికారులతో కలెక్టర్ ఇప్పటికే పలు సమావేశా లను నిర్వహించి  సూచనలను ఆదేశాలను జారీ చేశారు. ఏప్రిల్ 5వ తేదీ నుంచి పూర్తిస్థాయిలో కొనుగోలు చేసేందుకు అధికారు లు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్లో జిల్లా వ్యాప్తంగా 3.40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించాలని లక్ష్యంగా అధికారులు పెట్టుకున్నారు. 

 జిల్లావ్యాప్తంగా 414 కేంద్రాల ఏర్పాటు  యాసంగి సీజన్ సంబంధించి వనపర్తి జిల్లా వ్యాప్తంగా 414 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సర్వం సిద్ధం చేయడం జరిగిందని సంబంధిత అధికారులు తెలిపారు. సన్నరకానికి సంబంధించి 151 కేంద్రాలు, దొడ్డు రకానికి సంబంధించి 263 కేంద్రాలలో ధాన్యం కొనుగోలు జరుగనున్నట్లు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 

గత సీజన్ లో ధ్యానం సేకరిస్తున్న సమయంలో ఎదుర్కొన సమస్యను దృష్టిలో ఉం చుకొని  ఈ సీజన్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలను చేపడుతున్నారు. గత వాన కాలం నుండి సన్న రకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరతో పాటు రూపాయలు 500 ఇస్తున్న విషయం తెలిసిందే.

ఈ సీజన్లో కూడా సన్న రకానికి బోనసిస్తుండడంతో సన్న రకం, దొడ్డు రకం ధాన్యాన్ని వేరువేరుగా కొనుగోలు చేసేందుకు అధికారులు ఏర్పాటు చేస్తున్నారు.  కేంద్రాలకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుబాటులో గన్ని  బ్యాగులు సైతం తెప్పించనున్నట్లు సమాచారం. దీంతోపాటుగా కొనుగోలు కేంద్రాల కు అవసరమయ్యే ప్యాడి క్లీనర్లు తీవ్ర శాతం కొలిచే యంత్రాలు ఎలక్ట్రికల్ కాంటాలను సిద్ధం చేస్తున్నారు. 

ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరకే కొనుగోలు 

 ఆరుకాలం పండించిన పంటను రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరలు ప్రకటించి కొనుగోలు కేంద్రాల ద్వారా పంటను కొనుగోలు చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మద్ద తు ధర ప్రకారంగానే కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్ ఏ వరి ధాన్యానికి క్వింటాల్ రూ 2320, బి గ్రేడ్ వరి ధాన్యానికి క్వింటాల్ రూ 2300 మద్దతు ధర కాగా 17 శాతం తేమ ఉన్న వడ్ల ను మాత్రమే కొనుగోలు చేయనున్నారు. 

వరి ధాన్యం కొనుగోలుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష 

యాసంగి  వరి ధాన్యం కొనుగోలుపై  పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని సంబందించిన అధికారులతో   కలెక్టర్ ఆదర్శ్ సురభి ఈ నెల 27 న సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రైతుల నుండి ధాన్యం సేకరణ ప్రక్రియను సజావుగా, వేగవంతంగా పూర్తి చేయడంతో పాటు ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఎలాంటి ఇబ్బందు లు ఎదుర్కోకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. 

ప్రతి కొనుగోలు కేంద్రం లో రైతులకు షెడ్, కూర్చోడానికి కుర్చీలు, తాగు నీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఏదైనా సెంటర్లో మౌలిక సదుపాయాలు లేనిపక్షంలో కమిషన్ నిలిపివే యడం జరుగుతుందని హెచ్చరించారు. సన్న రకం ధాన్యం గుర్తించేందుకు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు వ్యవసాయ విస్తీర్ణాధికారుల ద్వారా  శిక్షణ ఇప్పించాలని సూచించారు.