calender_icon.png 14 January, 2025 | 6:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాత పంటల జాతరకు సర్వం సిద్ధం

14-01-2025 01:46:10 AM

  • నేడు న్యాల్కల్ మండలంలోని వడ్డీ గ్రామంలో ప్రారంభం 
  • జాతర ఉత్సవాలకు వ్యవసాయ శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు ప్రజాప్రతినిధులు రాక 
  • ఘనంగా సంక్రాంతి సంబురాలు 

సంగారెడ్డి, జహీరాబాద్, జనవరి 13 : అంతరించిపోతున్న జీవవైవిద్య పంటలను కాపాడేందుకు పాత పంటల జాతర నిర్వహిస్తున్నామని డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యుని తెలిపారు. సోమవారం జహీరాబాద్ మండలంలోని ప్రస్తాపూర్ గ్రామంలో ఉన్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో పాత పంటల జాతర ఏర్పాట్లపై విలేకరులతో మాట్లా డారు. పాత పంటలతో సుస్థిర వ్యవ సాయం చేయడంతో భూసారం పెరుగు తుందన్నారు.

రసాయన విలువలతో వ్యవసాయం చేయడంతో భూసారం తగ్గిపోయి పోషక విలువలు లేకుండా పోతున్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా సుస్థిర వ్యవసాయం చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారని వివరించారు. వర్షాధారంగా చిరుధాన్యాలు సాగు చేయడంతో పోషక విలువలు ఎన్నో ఉంటాయన్నారు. చిరుధాన్యాలు సాగు చేసేందుకు చిన్నా సన్నకారు రైతులు ముందుకు వస్తున్నారని దీంతో ఎంతో మేలు కలుగుతుందన్నారు.

రైతులు ప్రతి ఏడాది ప్రతి వరి వేయడంతో జీవవైవిద్యం లేకుండా పోతుందన్నారు. జీవవైవిద్యాన్ని కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అంతరించిపోతున్న పాత పంటలను కాపాడేందుకు డిడిఎస్ సంస్థ ముందుకు వచ్చిందని తెలిపారు. డిడిఎస్ సంస్థ పోరాటంతోని 2023లో ఐక్యరాజ్య సమితి చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిందని గుర్తు చేశారు. చిరుధా న్యాలను సాగు చేసే రైతులను ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. 

నెల రోజులపాటు పాత పంటల జాతర ఉత్సవాలు 

డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో మహిళలు నెల రోజులపాటు జహీరాబాద్ ప్రాంతంలో చిరుధాన్యాల పండగ జాతర ఉత్సవాలు నిర్వహిస్తారని తెలిపారు. మంగళవారం వడ్డీ గ్రామంలో పాత పంటల జాతరను ప్రారంభించేం దుకు ఐసి ఏఆర్ అటారి పదవ జోన్ డైరె క్టర్ డాక్టర్ షేక్ ఎన్ మీరా హాజరవుతు న్నారు అన్నారు. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ షెట్కార్ హాజరు కావడం జరుగుతుందన్నారు.

పాత పంటల జాతరను డిడిఎస్ 25 సంవత్సరాలుగా నిర్వహిస్తుందని తెలిపారు. ఈ ఏడాది 26 గ్రామాలను పాత పంటల జాతర నిర్వహిస్తున్నామని రూట్ మ్యాప్ ప్రకటించారు. నెల రోజులపాటు 400 కిలోమీటర్లు తిరిగి పాత పంటల పై ప్రజలకు అవగాహన చిరుధాన్యాల విత్తనా లతో అలంకరించిన ఎడ్లబండ్ల ఊరేగింపు గ్రామాలలో నిర్వహిస్తామని మహిళా రైతులు ఆటపాటలతో ముందుకు సాగుతారు అన్నారు.

ఫిబ్రవరి 11వ తేదీన జరా సంఘం మండలం మాచినూర్ పచ్చ సాలె ప్రహంగనంలో పాత పంటల జాతర ముగింపు ఉంటుందన్నారు. జీవవైవిద్యము కాపాడేందుకు మహిళా రైతులు కృషి చేస్తున్నారని తెలిపారు. వ్యవసాయ శాస్త్రవేత్తలు పాత పంటల జాతరలో పాల్గొ ని వ్యవసాయంలో జరుగుతున్న మార్పు లపై రైతులకు వివరిస్తారని తెలిపారు. రైతులకు వివరించడంతోపాటు జీవవైవి ద్యంపై జరుగుతున్న నష్టాన్ని పరిశోధన చేసేందుకు కృషి చేస్తారని తెలిపారు. 

డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో సంక్రాంతి వేడుకలు 

జహీరాబాద్ మండలంలోని పస్తాపూర్ గ్రామంలో ఉన్న డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ కార్యాలయంలో సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంక్రాంతి భోగి మంటలు వేసి ప్రజలకు పండగ శుభాకాంక్షలు తెలిపారు. మహిళా రైతులు భోగిమంటలు వేసి ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండి పాడిపంటలు పండి రైతులు అభివృద్ధి చెందాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిడిఎస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దివ్య వెలుగూరి, డిడిఎస్ కో డైరెక్టర్ గిరిధర్, ప్రతినిధులు మాణిక్యం, మంజుల, వినోద్, నర్సింలు  పాల్గొన్నారు.