calender_icon.png 29 April, 2025 | 9:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నీట్ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం

29-04-2025 12:20:29 AM

- సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్

 కొండపాక, ఏప్రిల్ 28: నీట్ పరీక్ష నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు జిల్లా అదనపు కలెక్టర్ గరీమ అగర్వాల్ తెలిపారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. మే 4వ తేదీన యూజీ నీట్ పరీక్ష నిర్వహణకు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా, పకడ్బందీగా  నిర్వహించాలని, అధికారులు సమన్వయంతో పని చేయాలని అన్నారు.

పరీక్షా కేంద్రాలు సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల, బాలికల ఉన్నత పాఠశాల లో నిర్వ హించనున్నామని, అధికారులను ఎంపిక చేసి, శిక్షణ ఇచ్చామని, విద్యార్థులకు ఎలాం టి ఇబ్బంది లేకుండా త్రాగునీరు, మరుగుదొడ్లు, నిరంతర విద్యుత్ సరఫరా చేయాల ని, పరీక్షా కేంద్రాల వద్ద ఓఆర్‌ఎస్, బేసిక్ మెడిసిన్స్ తో స్టాఫ్ నర్స్, ఆశ వర్కర్ తో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని అన్నారు.

పరీక్ష మధ్యాహ్నం 2 గంటలనుంచి, సాయంత్రం 5 గంటల వరకు ఉంటుందని, పరీక్ష కేంద్రాలల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు ముందుగానే పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు డిసిపి సుభాష్ చంద్రబోస్, కేంద్రీయ విద్యాలయ ప్రిన్సిపల్ సూర్య ప్రకాష్, సిద్దిపేట ఆర్టీవో సదానందం, డీఈవో శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట డిగ్రీ కాలేజీ ప్రిన్సిపాల్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, విద్యుత్ శాఖ ఎస్‌ఈ, తదితరులు పాల్గొన్నారు.