calender_icon.png 12 January, 2025 | 3:45 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మోతిమాత జాతరకు సర్వం సిద్ధం

12-01-2025 12:00:00 AM

  1. రెండు రోజులపాటు ఉత్సవాలు
  2. మొగుడంపల్లి మండలం ఉప్పరపల్లి తండాలో మోతిమాత జాతర 
  3. ఉత్సవాలకు తెలంగాణతో పాటు కర్ణాటక, మహారాష్ర్ట గిరిజన బిడ్డలు రాక
  4. అడవిబిడ్డల జాతరకు మోతిమాత దేవాలయం ముస్తాబు

సంగారెడ్డి, జనవరి 11 (విజయ క్రాం తి) / జహీరాబాద్ : మరియమ్మ మోతి మాత జాతర ఘనంగా నిర్వహిం చేందుకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండలం లోని ఉప్పరపల్లి తండాలో ఉన్న మరిగమ్మ మోతీమాత దేవాలయం వద్ద జాతర నిర్వహించేందుకు సర్వం సిద్ధం చేశారు.

జాతర ఉత్సవాలు రెండు రోజులపాటు నిర్వహిస్తారు. ఈ జాతరను గిరిజనులు వారి సాంప్రదాయ పద్ధతుల్లో నిర్వహిస్తా రు. ప్రతి గిరిజన తాండకు చెందిన కు టుంబంతో సహా అక్కడికి వచ్చి వంటలు చేసుకుని భోజనాలు చేసి అమ్మవారి దర్శ నాన్ని చేసుకుంటారు. ప్రతి ఏడాది 2 లక్ష లకు పైగా ప్రజలు వచ్చి అమ్మవారి దర్శ నం చేసుకుంటారని నిర్వాహకులు అంచ నా.

ఈ ఏడాది జాతరకు ప్రజలు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ఏర్పాట్లు భారీగా చేశారు. ఈ నెల 12, 13 తేదీల్లో జాతర నిర్వహించేందుకు అధికారు లు, ప్రజా ప్రతినిధులు జాతరకు ఏర్పాట్లు  చేశారు. ఉత్సవాలలో పాల్గొని భక్తులకు తాగునీటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక ట్యాంకులు ఏర్పాటు చేశారు.

జాతరకు వ చ్చే భక్తులకు ఇబ్బందులు లేకుండా మొ బైల్  మరుగుదొడ్ల, మూత్రశాలను ఏర్పా టు చేస్తున్నారు. దేవాలయం వద్ద దర్శనం కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగ కుండా నిర్వాహకులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అమ్మవారి దర్శనం చేసుకుంటే సంతానం కలుగుతుందని గిరిజనుల నమ్మకం..

మరియమ్మ మోతిమాత దర్శనం చేసు కుని పూజలు చేస్తే సంతానం కలుగు తుందని గిరిజనుల నమ్మకం. దీంతో ప్రతి ఏడాది కొత్తగా పెళ్లయిన జంటలు జాతర ఉత్సవాల్లో పాల్గొని అమ్మవారి దర్శనాలు చేసుకుంటారు. దేవాలయం ఆవరణలో ఉన్న పంచవృక్షాలకు ముడుపులు కట్టి ప్రదక్షిణలు చేస్తారు.

సంతానం కలగాలని, కుటుంబం సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని దర్శించుకుంటారు. గిరిజను లు ప్రతి ఏడాది అమ్మవారి దర్శనం కోసం వేలాదిగా వస్తుంటారు. జహీరాబాద్‌కు 15 కిలోమీటర్ల దూరంలో జాతర ఉత్సవాలు జరుగుతుంటాయి. కర్ణాటక రాష్ట్రానికి సమీపంలో ఉండడంతో బీదర్, గుల్బర్గా జిల్లాలకు చెందిన గిరిజనులు భారీ సంఖ్య లో జాతరకు హాజరవుతారు.

మహారాష్ర్ట కు చెందిన భక్తులు సైతం గిరిజనుల జాత రకు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుం టారు. అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు సేకరించి పంచ వృక్షాలకు ప్రదక్షిణలు చేస్తే మేలు జరుగుతుందని గిరిజనుల నమ్మకం. దీంతో ప్రతి ఏడాది భక్తుల సంఖ్య పెరిగిపోతుంది. 

12న అమ్మవారికి తీపి నైవేద్యం సమర్పణ..

మోతిమాత దేవాలయానికి సమీపంలో ఉన్న గిరిజన తండాల నుంచి జెండాలను తీసుకొని సాంప్రదాయ పద్ధతిలో డప్పులు కొట్టుకుంటూ గిరిజన సాంప్రదాయ పద్ధతి లో ఆటపాటలతో వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు. ఉదయం నుంచి గిరిజను లు కొత్త దుస్తులు ధరించి, అమ్మవారికి తీపి నైవిద్యం చేసుకుని తాండాల నుంచి డబ్బు లు కొట్టుకుంటూ ఆటపాటలతో గిరిజన సంప్రదాయం ప్రకారం దేవాలయం కు చేరుకుంటారు.

గిరిజన మహిళలు వారి వేషాధారణలో దుస్తులు వేసుకొని దేవాల యం ముందు ఆటపాటలతో మునిగిపో తారు. అమ్మవారికి నైవిద్యం సమర్పించి తిరిగి వారి తండాలకు వెళ్లిపోతారు. జాతర రోజు గిరిజన మహిళలు పట్టణాల్లో ఉన్న తండాలకు వచ్చి వారి వేషాధారణలో అమ్మవారిని దర్శించుకుంటారు.

13న భారీ జాతర ముగింపు..

13న ప్రతి గిరిజన తండాకు చెందిన కుటుంబాలు, బంధు మిత్రులతో కలిసి కుటుంబ సమేతంగా  దేవాలయానికి చేరు కొని అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతి ఒక్కరూ అమ్మ వారికి కోళ్లు, మేకలు బలిస్తారు. ఎక్కడ చూసి  అడవి లో గిరిజనులతో  కళకళలా డుతుంది. దేవాలయం వద్ద దర్శనం కోసం గంటల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితి ఉంటుంది.

మోతిమాత జాతర ప్రత్యేకత..

అమ్మ వారి జాతరకు అన్ని కులాలు అన్ని మతాలకు చెందిన వారు వచ్చి నైవిద్యం సమర్పించి తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారు. గిరిజనులు  తమకు కావల సిన వారికి పిలిచి భోజనాలు పెడతారు. దీంతో ఈ జాతరకు అడవి బిడ్డల జాతరగా పిలుస్తుంటారు.