27-02-2025 12:53:42 AM
మహబూబాబాద్. ఫిబ్రవరి 26 : నల్లగొండ- వరంగల్ -ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని ఫాతిమా హైస్కూల్ నుండి జిల్లాలోని 16 కేంద్రాలకు సంబంధించి ఎన్నికల సామాగ్రి పంపిణీ చేయడం జరిగింది.ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అద్వుతై కుమార్ సింగ్ పంపిణీ ప్రక్రియను పరిశీలించారు. కలెక్టర్ వెంట అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మచారి, మహబూబాబాద్,తొర్రూరు రెవెన్యూ డివిజన్ అధికారులు కే.కృష్ణవేణి, జి.గణేష్, ఎన్నికల నోడల్ అధికారులు, సెక్టరల్ అధికారులు తదితరులు ఉన్నారు.
కాటారంలో..
కాటారం, ఫిబ్రవరి 26 : ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సామాగ్రి సర్వం సిద్ధం చేసినట్లు కాటారం తహసిల్దార్ నాగరాజు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కాటారం పోలింగ్ స్టేషన్ నెంబర్ 273 పట్టభద్రుల కోసం అలాగే గ్రాడ్యుయేట్ టీచర్స్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 498 లకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరవేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికలలో స్వేచ్ఛగా, శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ నాగరాజు కోరారు.