calender_icon.png 23 February, 2025 | 9:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకు అంతా సిద్దం.. ఏ మ్యాచ్ ఎప్పుడు..?

16-02-2025 06:59:43 PM

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025: ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ(ICC Champions Trophy)-2025 కేవలం మూడు రోజుల దూరంలో ఉంది. ఎనిమిదేళ్ల విరామం తర్వాత ప్రతిష్టాత్మకమైన "మినీ వరల్డ్ కప్" తిరిగి రావడంతో అభిమానులు ఆనందంలో మునిగిపోయారు. 30 సంవత్సరాల చరిత్రలో పాకిస్తాన్ మొదటిసారిగా ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తుంది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లు కరాచీ, లాహోర్, రావల్పిండిలలో జరగనున్నాయి. అయితే భద్రతా సమస్యల దృష్ట్యా, బీసీసీఐ(BCCI) నిర్ణయం ప్రకారం టీమీండియా(Team India) తన అన్ని మ్యాచులు దుబాయ్‌లో ఆడనుంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో టీమీండియాపై గెలిచిన డిఫెండింగ్ ఛాంపియన్ పాకిస్తాన్, సొంతగడ్డపై మరోసారి ట్రోఫీని ఎత్తేయాలని ఆసక్తిగా ఉంది. 

టీమీండియా గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లలో అర్హత సాధిస్తే నాకౌట్ మ్యాచ్‌లతో సహ పూర్తిగా దుబాయ్‌లోనే ఆడనుంది. ఈ టోర్నీలో అఫ్గానిస్తాన్ టీమ్ తొలిసారిగా పాల్గొంటుండగా శ్రీలంక, వెస్టిండీస్ జట్లు గైర్హాజరు కావడం గమనార్హం. గాయాల సమస్యల వల్ల కొన్ని జట్లు, ముఖ్యంగా ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లు దూరం కావడంతో ఎక్కువగా బాధపడుతోంది.

టోర్నమెంట్‌లో పాల్గొంటున్నా జట్లు:

ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 టోర్నీలో మొత్తం ఎనిమిది జట్లు పాల్గొంటున్నాయి.

1. న్యూజిలాండ్

2. ఆఫ్ఘనిస్తాన్

3. ఇంగ్లాండ్

4. ఆస్ట్రేలియా

5. దక్షిణాఫ్రికా

6. ఇండియా

7. పాకిస్థాన్

8. బంగ్లాదేశ్

ఛాంపియన్స్ ట్రోఫీ 2025 వేదికలు: 

కరాచీలోని నేషనల్ స్టేడియం, లాహోర్‌లోని గడాఫీ స్టేడియం, రావల్పిండి క్రికెట్ స్టేడియం పాకిస్తాన్‌లో మ్యాచ్‌లకు ఆతిథ్యం వహిస్తాయి. టీమీండియా అర్హత సాధిస్తే సెమీఫైనల్స్, ఫైనల్‌తో సహా అన్ని మ్యాచ్‌లకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదిక అవుతుంది.

ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025 షెడ్యూల్:

గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లు:-

ఫిబ్రవరి 19:  పాకిస్తాన్ vs న్యూజిలాండ్ - కరాచీ

ఫిబ్రవరి 20:  ఇండియా vs బంగ్లాదేశ్ – దుబాయ్

ఫిబ్రవరి 21:  ఆఫ్ఘనిస్తాన్ vs దక్షిణాఫ్రికా – కరాచీ

ఫిబ్రవరి 22:  ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్ – లాహోర్

ఫిబ్రవరి 23:  ఇండియా vs పాకిస్తాన్ – దుబాయ్

ఫిబ్రవరి 24:  బంగ్లాదేశ్ vs న్యూజిలాండ్ - రావల్పిండి

ఫిబ్రవరి 25:  ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా – రావల్పిండి

ఫిబ్రవరి 26:  ఆఫ్ఘనిస్తాన్ vs ఇంగ్లాండ్ – లాహోర్

ఫిబ్రవరి 27:  పాకిస్తాన్ vs బంగ్లాదేశ్ - రావల్పిండి

ఫిబ్రవరి 28:  ఆస్ట్రేలియా vs ఆఫ్ఘనిస్తాన్ – లాహోర్

మార్చి 1:  ఇంగ్లాండ్ vs దక్షిణాఫ్రికా – కరాచీ

మార్చి 2:  ఇండియా vs న్యూజిలాండ్ – దుబాయ్

నాకౌట్స్:

మార్చి 4: సెమీ-ఫైనల్ 1 – దుబాయ్

మార్చి 5: సెమీఫైనల్ 2 – లాహోర్

మార్చి 9: ఫైనల్ – లాహోర్/దుబాయ్