* ఇస్రో చరిత్రలో మరో మైలురాయి చేరేందుకు సిద్ధం
* శ్రీహరికోట నుంచి ఇప్పటికే 99 ప్రయోగాలు
* జనవరిలో ముహూర్తం
న్యూఢిల్లీ, డిసెంబర్ 31: ప్రపంచ దేశాలు ముక్కున వేలేసుకునేలా... ప్రయోగాల్లో విజయవంతమవుతున్న ఇస్రో మరో మైలురాయిని అందుకునేందుకు తహతహలాడుతోంది. శ్రీహరి కోట వేదికగా ఇస్రో ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేపట్టింది. జనవరిలో 100వ ప్రయోగం చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఇస్రో శాస్త్రవేత్త ఒకరు తెలిపారు. స్పేడెక్స్ సక్సెస్‌తో 2024కు వీడ్కోలు పలికిన ఇస్రో 2025లో 100వ ప్రయోగం చేపట్టేందుకు ఉవ్విళ్లూరుతోంది.
స్పేడెక్స్ సక్సెస్
సోమవారం రోజు ప్రయోగించిన పీఎస్‌ఎల్వీ సీ ప్రయోగం విజయవంతం అయినట్లు ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు. స్పేస్ డాకింగ్ సాంకేతికతతో చేపట్టిన ఈ ప్రయోగం మీద అనేక అంశాలు ఆధారపడి ఉన్నాయి.
ఈ ప్రయోగం ద్వారా రెండు ఉపగ్రహాలను ఇస్రో శాస్త్రవేత్తలు రోదసిలోకి పంపారు. ‘మీరంతా అద్భుతమైన స్పేడెక్స్ ప్రయోగం విజయవంతం చూశారు కదూ.. సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఇది 99వ ప్రయోగం. వందో ప్రయోగం అతి త్వరలోనే ఉంటుంది.
99 కూడా మాకు ముఖ్యమైన సంఖ్యే. 2025లో మా ముందు పెద్ద, పెద్ద లక్ష్యాలు ఉన్నాయి. నేవిగేషన్ శాటిలైట్ జనవరిలో ప్రయోగిస్తాం. ఇస్రో ఇప్పటికే నేవిగేషన్ శాటిలైట్ విజయవంతంగా ప్రయోగించింది. జీఎస్‌ఎల్వీ రాకెట్ ఎన్వీఎస్ (నేవిగేషన్ శాటిలైట్ విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టింది’ అని ఇస్రో చైర్మన్ సోమనాథ్ తెలిపారు.
డాకింగ్ మీద రానున్న రోజుల్లో మరిన్ని
భారత్ మొదటి సారిగా స్పేస్ డాకింగ్ సాంకేతికతతో ప్రవేశపెట్టిన స్పేడెక్స్ విజయవంతం కావడంతో ఇస్రో శాస్త్రవేత్తలు ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ సాంకేతికతతో రానున్న రోజుల్లో మరిన్ని ప్రయోగాలు చేయనున్నట్లు ఇస్రో చైర్మన్ తెలిపారు. సోమవారం చేపట్టిన ప్రయోగం భారత అంతరిక్ష పరిశోధనలకు ఎంతో ముఖ్యమని కూడా పేర్కొన్నారు.
వందతో చిందేసేనా?
శ్రీహరికోట నుంచి ఇస్రో శాస్త్రవేత్తలు ఇప్పటి వరకు 99 ప్రయోగాలు చేపట్టి వందో ప్రయోగానికి సిద్ధం అవుతున్నారు. 100వ ప్రయోగం విజయ వంతం కావాలని.. మన కీర్తి నలువైపులా వ్యాపించాలని కోరుకుంటూ..