వందల సంవత్సరాల క్రితం ఓ చిన్న ఆధ్యాత్మిక కార్యక్రమంగా మొదలైన కుంభమేళ ఇప్పుడు ఒక మహోత్సవంగా రూపు దాల్చింది. పన్నెండేళ్ల తర్వాత జరుగుతున్న కారణంగా ఇది ‘పూర్ణ కుంభమేళా’. దీనినే ‘మహా కుంభమేళా’గానూ పిలుస్తున్నారు. 2013లో ప్రయాగ్‌రాజ్‌లోనే మహా కుంభమేళా నిర్వహించారు. ఈనెల 13నుంచి ఫిబ్రవరి 26 వరకు మహాకుంభ స్నానాలు జరుగుతాయి.
భూలోకంలో ఒక ఏడాది దేవతలకు ఒకరోజుతో సమానం. దీని ప్రకారం దేవతలు, రాక్షసుల మధ్య 12 ఏళ్లపాటు యుద్ధం జరిగింది. ఈ లెక్కన దేవతలకు 12 సంవత్సరాలైతే భూలోకంలో ఆ కాలం 144 సంవత్సరాలకు సమానం. జ్యో తిషశాస్త్రం మేరకు బృహస్పతి ఒక రాశిలో ఏడాదిపాటు నివాసం ఉంటాడు. 12 రాశుల మీదుగా ప్రయాణించేందుకు ఆయనకు దా దాపు పన్నెండేళ్ల సమయం పడుతుంది.
ఈ కారణాలవల్లే దీనిని ‘మహా కుంభమేళా’గా వ్యవహరిస్తారు. ఇది ప్రత్యేకంగా నాలుగు ప్రధాన ప్రదేశాలైన ప్రయాగ్‌రాజ్, హరిద్వార్, నాసిక్, ఉజ్జయినీలలో నిర్వహిస్తున్నా రు. కుంభమేళా సమయంలో ఈ నదుల్లో పుణ్యస్నానం ఆచరించడం వల్ల మోక్షం లభిస్తుందని హిందువుల ప్రగాఢ విశ్వాసం. ఈ సమయంలో ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమంలోని నీరు అమృతం అంత పవిత్రమైం దని ప్రజలు నమ్ముతారు.
మహా కుంభమేళాలో పుణ్యస్నానం చేయడం వల్ల సకల దేవ తల ఆశీస్సులు లభిస్తాయని కూడా వారు విశ్వసిస్తారు. మహా కుంభమేళాకు సుమారు 850 ఏళ్లకు పైగా చరిత్ర ఉన్నట్లు చెబుతారు. మొదట దీనిని జగద్గురువు ఆదిశంకరాచార్యులు ప్రారంభించినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక దినాలలో రాజస్నానాలు
పవిత్రమైన మహా కుంభమేళాలో ఆచరించే తొలిరోజు స్నానానికే ‘రాజస్నానం’ అని పేరు. దీనికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ శుభ సమయంలో గ్రహాలు, నక్షత్రాల సంగమం అంతా పవిత్రజలాలలోకి వచ్చి చేరుతుందని భక్తులు నమ్ముతారు.
ఆ వేళ స్నానాలు చేసిన వారికి చంద్రుడుసహా ఇతర గ్రహాలన్నింటి అనుగ్రహం లభిస్తుందనీ అంటారు. అంతేకాదు ఆరోగ్యం, ఐశ్వర్యం సహా ఎన్నో సత్ఫలితాలు ఉంటాయనీ చెబుతారు. మహా కుంభమేళా జరిగినన్ని రోజుల్లోని విశేష తిథుల్లో జరిగే స్నానాలనూ ‘రాజస్నానాలు’గానే భావిస్తున్నారు.
అద్భుత భక్తి, ఆధ్యాత్మిక శోభ
ఆయా ప్రదేశాలలో పవిత్ర స్నానాలేకాదు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా మరో ఆకర్షణగా నిలువబోతున్నాయి. నది ఒడ్డున భక్తులు వివిధ ప్రార్థనలు, ఆచారాలు, అగ్ని వేడుకలు నిర్వహిస్తారు. పవిత్ర నదుల్ని కొలిచేందుకు సూర్యోదయం, అస్తమయ సమయాల్లో హారతి నిర్వహిస్తారు. భక్తిగీతాలు ఆలపిస్తారు. అంతేకాదు, మతపరమైన సంప్రదాయ సంగీతం, నృత్యాలు, నాటకాలు వంటి సాంస్కృతిక ప్రదర్శనలూ ఉంటాయని అంటున్నారు.
స్థానిక హస్తకళలు, ఆహారం, ధార్మిక సామాగ్రిని విక్రయించే స్టాళ్లనుకూడా ఏర్పాటు చేస్తున్నట్టు తెలుస్తున్నది. భక్తిగీతాల సంగీత శబ్దాలతో ఆ ప్రదేశాలన్నీ ఆధ్యాత్మిక శోభతో అలరారుతుంటాయి. చూసేవారికి అనూహ్యమైన కన్నుల పండుగే. ధ్యాన సాధన విధానంలో నిమగ్నమైన భక్తులకు అత్యంత అరుదైన అవకాశంగానూ దీన్ని భావిస్తారు. ఈసారి దాదాపు 50 కోట్లమంది మహా కుంభమేళాలో పాల్గొంటారని అంచనా.
భక్తుల ఐక్యతకు..
కోట్లాదిమంది భక్తుల రాకకు తగ్గట్లుగానే భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. యాత్రికులు, సాధువులు, సన్యాసులు, పర్యాటకులు ఈసారి భారీ ఎత్తున తరలి రానున్నారు. ఈ మహా కుంభమేళాను స్వచ్ఛంగా, ఆరోగ్యంగా, సురక్షితంగా, డిజిటల్ కార్యక్రమంగా మార్చేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేసిందని కూడా వార్తలు వస్తున్నాయి.
ఈ కుంభమేళాను ప్లాస్టిక్ రహితంగా నిర్వహించేందుకూ సన్నాహాలు చేస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లో లక్షలాది మొ క్కలు నాటారు. కుంభమేళా పూర్తయిన తర్వాత కూడా వాటిని పరిరక్షిస్తామని యూపీ ప్రభుత్వం చెబుతోంది. కులాలు, తెగలు అనే తారతమ్యం లేకుండా హిందువుల ఐక్యతను చాటే కుంభమేళా మహాయజ్ఞాన్ని తలపిస్తుందని ఆధ్యాత్మిక గురువులు చెబుతున్నారు.
ముక్తావళి