26-02-2025 01:12:04 AM
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి ) : మెదక్, - నిజామాబాద్, - ఆదిలాబాద్, - కరీంనగర్ నియోజక వర్గాల పట్టభద్రులు, ఉపాధ్యాయ శాసన మండలి సభ్యుల ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మంగళవారం కలెక్టర్ రేట్ లో జిల్లా అదనపు కలెక్టర్ సబావత్ మోతిలాల్, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్ డి ఓలు శ్రీనివాస్ రావు, హరికృష్ణలతో కలిసి బ్యాలెట్ బాక్స్ ల, సామాగ్రిని పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుందని, ఎన్నికల పోలింగ్ నిర్వహణ కొరకు ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. పట్టభద్రుల ఎన్నికలకు 48 జంబో బ్యాలెట్ బాక్స్ లు కేటాయించగా అందులో 8 అదనపు బాక్స్ లు, 48 స్మాల్ బ్యాలెట్ బాక్స్ లు కేటాయించగా అందులో 8 అదనపు బాక్స్ లు కేటాయించామన్నారు.
ఉపాధ్యాయుల ఎన్నికల కొరకు 44 స్మాల్ బ్యాలెట్ బాక్స్ లు కేటాయించగా అందులో 8 అదనపు బాక్స్ లను కేటాయించినట్లు వెల్లడించారు. జిల్లాలో 40 పట్టభద్రులు, 18 ఉపాధ్యాయ ఎన్నికలకు పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసామని, ఈ నెల 26న ఉదయం 10 గంటలకు ర్యాండమైజేషన్ ప్రక్రియలో కేటాయించిన ప్రకారంగా బ్యాలెట్ బాక్స్ లు, ఇతర సామాగ్రి పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి వెంకటేశ్వర్ రావు, కలెక్టరేట్ పరిపాలన అధికారి రాజేశ్వర్, ఎన్నికల విభాగం అధికారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.