-25 నుంచి 28 వరకు రాష్ట్ర మహాసభలు
-రాష్ట్ర మహాసభలకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులు బృందా కారత్, బివి రాఘవులు, తమ్మినేని వీరభద్రం, చుక్క రాములు రాక
-సంగారెడ్డి పట్టణంలో మా సభకు సర్వం సిద్ధం..
సంగారెడ్డి (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర సిపిఎం 4 వ మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు నిర్వాహకులు భారీగా ఏర్పాటు చేశారు. శనివారం సంగారెడ్డి పట్టణంలో సిపిఎం రాష్ట్ర మహాసభలను ప్రారంభించేందుకు నిర్వాహకులు భారీగా ఏర్పాట్లు చేశారు. 25 నుంచి 28 వరకు రాష్ట్ర మహాసభలను సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్నారు. ఈ మాసభలకు దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన వెయ్యి మంది ప్రతినిధులు హాజరవుతున్నట్టు నిర్వాహకులు తెలిపారు. భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐ(ఎం) తెలంగాణ రాష్ట్ర నాలుగో మహాసభలను సంగారెడ్డి పట్టణంలో నిర్వహిస్తున్నారు. మహాసభలకు సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్, బివి రాఘవులు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు హాజరు కావడం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.
ఎరుపెక్కిన సంగారెడ్డి
సంగారెడ్డి పట్టణంలో సిపిఎం రాష్ట్ర మహాసభలు నిర్వహించేందుకు భారీ ఏర్పాట్లు చేశారు. పట్టణంలోని ప్రధాన చౌరస్తాలు, జాతీయ రహదారులు, ప్రధాన రోడ్లపై ఎర్రజెండ్లతో ముస్తాబు చేశారు. 65వ జాతీయ రహదారి లింగంపల్లి నుంచి జహీరాబాద్ సరిహద్దు వరకు ఎర్రజెండా తోరణాలు కట్టారు. మహాసభ జరిగే గోకుల్ ఫంక్షనాలను ప్రత్యేకంగా ముస్తాబు చేశారు. సంగారెడ్డి పట్టణంలో ఎక్కడ చూసినా ఎర్రజెండలే కనిపిస్తున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు రావడంతో నిర్వాహకులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.
భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు
సంగారెడ్డి పట్టణంలో నాలుగవ మహాసభల సందర్భంగా భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తున్నారు. శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సిపిఎం నాయకులు సర్వం సిద్ధం చేశారు. సిపిఎం బహిరంగ సభకు మద్దతుదారులతో పాటు సానుభూతిపరులందరూ పెద్ద ఎత్తున పాల్గొనాలని ప్రచారం నిర్వహించారు. నెలరోజుల నుంచి సిపిఎం నాయకులు సంగారెడ్డి జిల్లాలో ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహించారు. ఫ్యాక్టరీలు కార్యాలయాలు వద్ద సమావేశాలు నిర్వహించి సిపిఎం బహిరంగ సభ ప్రచారం చేశారు. సంగారెడ్డి పట్టణానికి సిపిఎం ముఖ్య నాయకులు హాజరు కావడంతో ఎక్కడ చూసినా ఎర్రజెండలో దర్శనమిస్తున్నాయి.