calender_icon.png 4 March, 2025 | 10:25 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం

03-03-2025 12:27:41 AM

* ఏర్పాట్లు పూర్తి చేసిన ఎన్నికల కమిషన్

* ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్

* 25 టేబుళ్లు.. 350 సిబ్బంది ఏర్పాటు మూడు షిఫ్టుల్లో లెక్కింపు.. ఫలితాలపై ఉత్కంఠ

నల్లగొండ, మార్చి 2 (విజయక్రాంతి): వరంగల్, -ఖమ్మం,- నల్లగొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. నల్లగొం డలోని ఐటీ హబ్ సమీపంలోని స్టేట్ వేర్ హౌసింగ్ గోదాములో ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సోమవారం ఉద యం 8 గంటల నుంచి కౌటింగ్ ప్రారంభమవుతుంది. ఉదయం 7 గంటలకు  అభ్య ర్థులు, ఏజెంట్ల సమక్షంలో స్ట్రాంగ్‌రూమ్ ఓపెన్ చేయనున్నారు. ఓట్ల లెక్కింపునకు 25 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

ప్రతీ టేబుల్ ఓ సూపర్‌వైజర్, మైక్రోఅబ్జార్వర్, ఇద్దరు  కౌంటింగ్ అసిస్టెంట్లు ఉంటారు వీరితోపాటు .20 శాతం రిజర్వు సిబ్బందిని అందుబాటులో ఉంచారు. 150 మంది సిబ్బంది కౌంటింగ్ చేపట్టనుండగా వీరికి 200 మంది సిబ్బంది సహాయం అందించనున్నారు. మొత్తం 350 మంది సిబ్బంది లెక్కింపు ప్రక్రియలో పాల్పంచుకోనున్నారు. అవాంఛనీ య ఘటనలకు తావులేకుండా 250 మంది పోలీస్ సిబ్బంది భద్రతను పర్యవేక్షించనున్నారు.

  మూడు దశల్లో లెక్కింపు చేపట్టను న్నట్లు రిటర్నింగ్ అధికారి, నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. తొలుత రో- ఆఫీసర్లు బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్ల అకౌంట్‌తో సహా స్ట్రాంగ్ రూమ్ నుంచి టేబుళ్లపైకి తెస్తారు. ప్రతీ 5 టేబుళ్లకు ఓ రో- ఆఫీసర్ ఉంటారు. అనంతరం లెక్కింపు సిబ్బంది బ్యాలెట్ బాక్స్‌లను కౌంటింగ్ ఏజెంట్లకు చూపి సీల్ ఓపెన్ చేసి బ్యాలెట్ పేపర్లను ట్రేల్లో వేస్తారు. వీటిని ఫారం- 16తో సరిచూసుకొని అకౌంట్‌తో సరిపోతే కౌంటింగ్ ఏజెంట్ల సంతకం తీసుకుంటారు.

ఆ తర్వాత 25 బ్యాలెట్ పేపర్లను ఓ కట్టగా కట్టి వీటిని ట్యాబులేషన్ బృందం పరిశీలనకు పంపుతారు. అనంతరం  బ్యాలెట్ పేపర్లను డ్రమ్ ఇన్చార్జ్‌కు అప్పగిస్తారు. ఈ ప్రక్రియ  8 బ్యాచులుగా జరుగుతుంది. ప్రాధాన్యతా ప్రకారం ఓటర్లు ఓటు వేయగా.. కౌంటింగ్ కూడా అదేవిధంగా చేపడతారు. పోలైన బ్యాలెట్లన్నింటినీ కట్టలు కట్టి తర్వాత తొలి ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. చెల్లని ఓట్లను అదేసమయంలో పక్కన పెడతారు. చెల్లిన ఓట్లను పరిగణనలోకి తీసుకుంటూ గెలుపునకు అవసరమైన కోటాను నిర్ణయిస్తారు.

చెల్లిన ఓట్లల్లో యాభై శాతం ప్లస్ ఒకటి కలిపి విజేతకు అవసరమైన గెలుపు కోటాను నిర్ధారిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలోనే ఈ గెలుపు కోటాను అభ్యర్థులు సాధిస్తే సరి. లేకుంటే ఎలిమినేషన్ పద్ధతిలో సుధీర్ఘంగా గెలుపు కోటా వచ్చే వరకు లెక్కింపు కొనసాగనుంది.టేబుల్‌కు 40 బండిల్స్ చొప్పున ఇస్తూ వెయ్యి ఓట్లను లెక్కిస్తారు.

మొత్తం 25 టేబుళ్లపై ఒక్క రౌండ్‌లోనే పోలైన 24,139 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు సాయంత్రం 6 గంటల వరకు పూర్తి కావచ్చని అంచనా. ఇది పూర్తయ్యాక చెల్లని ఓట్ల లెక్క తేల్చి మొత్తం చెల్లిన ఓట్లలో 50 శాతం1ను గెలుపు కోటాగా నిర్ధారిస్తారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో ఏ అభ్యర్ధికి గెలుపు కోటా రాకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ చేపడతారు.