19-03-2025 10:42:18 PM
మండలంలో రెండు పరీక్ష కేంద్రాలు..
సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు..
చర్ల (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ఈనెల 21 నుండి ఏప్రిల్ 2 వరకు జరగనున్న 10వ తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని చర్ల మండల విద్యాశాఖాధికారి పరిటాల వెంకటరమణ తెలియజేశారు. మండలంలో మొత్తం 308 మంది విద్యార్థిని విద్యార్థులు హాజరు కానున్నారు. ఈ పరీక్షల నిర్వహణ కోసం మండలంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల చర్ల, జడ్ పీ హై స్కూల్ సత్యనారాయణపురం పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఉదయం 9.30 గం నుండి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షలు జరగనున్నాయి. ఈ కేంద్రాల వద్ద 144సెక్షన్ అమలవుతుందని మండల విద్యాశాఖాధికారి తెలిపారు. ఈ పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించేందుకు ఇద్దరు సీఎస్, డివోలను, ముగ్గురు కస్టోడియన్స్ ను, 24 మంది ఇన్విజిలేటర్లను, ఇద్దరు సిట్టింగ్ స్కాడ్ లను ఏర్పాటు చేసారు. ఈ పరీక్షలను సమర్థవంతవంగా నిర్వహించుటకు గాను సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఈ పరీక్షలు జరుగుతాయని ఎంఈఓ తెలియజేశారు.