calender_icon.png 1 March, 2025 | 9:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మార్చి 2న నిర్వహించే శ్రీ అష్టలక్ష్మి యాగం భూమి పూజకి సర్వం సిద్ధం

01-03-2025 06:51:50 PM

భద్రాచలం (విజయక్రాంతి): భద్రాచలం శివారులోని ఎటపాక మండలం శ్రీ సీతారాముల వారు నడయాడిన ఉష్ణ గుండాల సమీపంలో మార్చి 12 నుంచి 23 వరకు నిర్వహించే స్థలంలో మార్చి 2 ఆదివారం ఉదయం 9:15 నిమిషాలకు శ్రీ అష్టలక్ష్మి పీఠం వ్యవస్థాపక ఆచార్యులు, శ్రీ పీతాంబరం రఘునాథచార్యులు స్వామీజీ వారి ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం నిర్వహించబడుతుందనీ గుండాల ఎంపీటీసీ వెంకట్రామిరెడ్డి తెలిపారు. శ్రీ అష్టలక్ష్మి యాగం నిర్వహించే ఆశ్రమ స్థలములో 108 మంది జంటలతో నాగలితో దుక్కిని కదిలించి భూమి పూజ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది ఆయన తెలిపారు. 

కావున ఈ కార్యక్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలోని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో, పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీ అష్టలక్ష్మి పీఠం వ్యవస్థాపకాచార్యులు, శ్రీ పీతాంబరం రఘునాథచార్యులు స్వామీజీ, నక్కా భాస్కరరావు, (రిటైర్డ్ డిఈ పంచాయతీరాజ్) గాదె మాధవరెడ్డి (పట్టణ సంఘ సేవకులు) గుండాల ఎంపీటీసీ గొంగడి వెంకటరామిరెడ్డి పుట్టి రమేష్ (తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు) ఎడ్ల లక్ష్మణరావు ఎడ్ల బాలాజీ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు.