calender_icon.png 8 February, 2025 | 4:46 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేస్ 4కు సర్వం సిద్ధం

08-02-2025 12:00:00 AM

బాలీవుడ్‌లో ఫ్రాంచైజీలకు కొదువేం లేదు. ఏడాదికో ఫ్రాంచైజీ వస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే త్వరలోనే మరో హైలీ యాంటిసిపేటెడ్ ఫ్రాంచైజీ ఫిల్మ్ రా నుంది. దీనికి ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అది మరేదో కాదు.. ‘రేస్ 4’. అయితే ఒకటి, రెండు ఫ్రాంచైజీల్లో హీరోగా నటించిన సైఫ్ అలీఖాన్.. ఎందుకోగానీ మూడో ఫ్రాంచైజీలో మిస్ అయ్యాడు.

ఆ స్థానాన్ని సల్మాన్ ఖాన్ భర్తీ చేశాడు. ఇప్పుడు నాలుగవ ఫ్రాంచైజీలో మాత్రం తనే నటిస్తానని సైఫ్ చెబుతున్నాడు. ‘రేస్ 4’లో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. ఈ ఫ్రాంచైజీలో సిద్దార్థ్ నటించడం ఇదే తొలిసారి.

‘రేస్’ ఫ్రాంచైజీలో ఇప్పటి వరకూ దీపిక, కత్రినా, బిపాషా, అమీషా, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ వంటి ముద్దుగుమ్మలు నటించారు. అలాగే ‘రేస్ 4’లోనూ మరో ఇద్దరు యంగ్ బ్యూటీస్ దర్శనమివ్వనున్నారు. వారు మరె వరో కాదు.. మాజీ మిస్ వరల్డ్ మానుషి చిల్లర్, ‘ముంజా’తో పాపులర్ అయిన శార్వరి. వీరిద్దరూ సైఫ్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.