calender_icon.png 26 February, 2025 | 8:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధం

26-02-2025 04:22:45 PM

కాటారం (విజయక్రాంతి): ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల  పోలింగ్ ప్రక్రియకు సంబంధించిన సామాగ్రి సర్వం సిద్ధం చేసినట్లు కాటారం తహసిల్దార్ నాగరాజు తెలిపారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మంథని శాసనసభ నియోజకవర్గం పరిధిలోని కాటారం పోలింగ్ స్టేషన్ నెంబర్ 273 పట్టభద్రుల కోసం అలాగే గ్రాడ్యుయేట్ టీచర్స్ పోలింగ్ స్టేషన్ నెంబర్ 498 లకు సంబంధించిన పోలింగ్ సామాగ్రి పోలింగ్ కేంద్రాలకు చేరవేసినట్లు ఆయన పేర్కొన్నారు. పోలింగ్ కేంద్రాలలో ఓటర్లకు వసతులను ఆయన పరిశీలించారు. పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ అధికారులు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారని వివరించారు. ఎన్నికలలో స్వేచ్ఛగా, శాంతియుతంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తహసీల్దార్ నాగరాజు కోరారు.