బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్, రమ దంపతులచే సోమవారం బెల్లంపల్లి నెంబర్ 2 గ్రౌండ్లో సాయంత్రం నిర్వహించగల లక్ష దీపోత్సవ కార్యక్రమానికి నాయకులు సర్వం సిద్ధం చేశారు. లక్ష దీపోత్సవ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనే అవకాశాలు ఉండడంతో మైదానాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. దీపాలు వెలిగించేందుకు అణువుగా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశారు. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 10 వరకు లక్ష దీపోత్సవం కార్యక్రమంలో మహిళలు పాల్గొననున్నారు. లక్ష దీపోత్సవ ఏర్పాట్లను సోమవారం బెల్లంపల్లి మాజీ మున్సిపల్ చైర్మన్ మత్తమారి సూరిబాబు, ప్రచార కమిటీ కన్వీనర్ నాతరి స్వామి, జిల్లా ప్రధాన కార్యదర్శి గెల్లి జయరాం యాదవ్, సిలువేరు సత్యనారాయణ, సీనియర్ నాయకులు మహమ్మద్ వసీం, గంధం రమేష్, మంచిర్యాల జిల్లా సేవాదళ్ చైర్మన్ బండి రాము యాదవ్, సీనియర్ కాంగ్రెస్ నాయకులు మునిమంద రమేష్, బాపూరావు, బానయ్యలు పాల్గొన్నారు.