12-04-2025 12:00:00 AM
మంచిర్యాల, ఏప్రిల్ 11 (విజయక్రాంతి) : 2024 యాసంగి సీజన్ ధాన్యం సేకరణకు సంబంధిత శాఖ అధికారులు అంతా సిద్ధం చేశారు. జిల్లా వ్యాప్తంగా 95,344 ఎకరాల సాధారణ సాగు కాగా 1,21,702 (దొడ్డు రకం 1,14,774, సన్న రకం 6,928 ) ఎకరాలలో వరి సాగవగా కొనుగోలు కేం ద్రాలకు 3 లక్షల 30 వేల 440 (దొడ్డు రకం 3,13,778, సన్న రకం 16,662) మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి రానుందని వ్యవసాయ శాఖ అధికారులు అంఛనా వేశారు.
జిల్లాలో అక్కడక్కడ కోతలు ప్రారంభం కాగా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు సివిల్ సప్లయ్ అధికారులు అంతా సిద్దం చేసి కొనుగోళ్లు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు.
జిల్లా వ్యాప్తంగా వరి పంట సాగు చేసిన రైతులు వచ్చే సీజన్‌కు విత్తనాల కోసం 9,860 మెట్రిక్ టన్నుల వరకు వాడుకోవ డం లాంటివి మినహాయిస్తే కొనుగోలు కేం ద్రాలకు3,30,440 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అధికారులు అంఛనా వేశారు. ఈ ధాన్యాన్ని మూడు ఏజెన్సీల పరిధిలోని 321 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో డీఆర్డీఏ (ఐకేపీ) ఏజెన్సీకి 194, పీఏసీఎస్ కు 121, మెప్మా ఏజెన్సీకి 6 సెంటర్లను కేటాయించారు.
సన్నాలకు రూ.500 బోనస్
దళారులు, వ్యాపారుల చేతిలో రైతులు మోసపోవద్దని, వారికి మద్దతు ధర కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించింది. క్వింటాలు ’ఏ’ గ్రేడ్ రకానికి రూ.2,320, సాధారణ రకానికి రూ. 2,300 చెల్లించనుంది. మరోవైపు ఖరీఫ్‌లో ఇచ్చిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం సన్న రకం ధాన్యానికి క్వింటాలుకు రూ. 500 బోనస్ అధనంగా చెల్లించనుంది.
82.98 లక్షల గన్నీ సంచులు
అధికారుల అంచనా ప్రకారం జిల్లాలో ఏప్రిల్ నెలలో 1,15,654 మెట్రిక్ టన్నుల ధాన్యం రానుందని, మేలో 1,98,264 మెట్రి క్ టన్నులు, జూన్ నెలలో 16,522 మెట్రిక్ టన్నుల ధాన్యం రానుంది. ఈ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల నుంచి మిల్లులకు తరలించేందుకు 82,98,375 గన్నీ బ్యాగులు అవసరం కాగా ప్రస్తుతం 26,46,527 (20, 29,832 కొత్తవి, 6,16,695 పాతవి) గన్నీలు సివిల్ సప్లయ్స్ గోదాముల్లో అందుబాటు లో ఉన్నాయి. మిగితా 56,51,848 బార్దాన్ అవసరానికి అనుగుణంగా విడతల వారిగా తెప్పించనున్నారు.
కొనుగోళ్లకు అంతా సిద్ధం
జిల్లాలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల మూడవ వారంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నం. ముందుగా సెంటర్లకు ధాన్యం వచ్చే జన్నారం, హాజీపూర్, దండేపల్లి, లక్షెట్టిపే ట మండలాల్లోని కొనుగోలు కేంద్రాలలో గన్నీ సంచుల సరఫరా షురూ చేశాం. మిగిలిన మండలాలకు ధాన్యం కోతలు ప్రారంభం కాగానే పంపించే ఏర్పాట్లు చేశాం.
నియోజక వర్గాల వారీగా లక్షెట్టిపేట, చెన్నూర్, బెల్లంపల్లిల్లో అవగాహన సదస్సులు పెట్టాం. ధాన్యం ఎప్పు డు హార్వెస్టింగ్ చేయాలో, ఎప్పుడు కేం ద్రాలకు తీసుకురావాలో తదితరాలపై రైతులకు క్లస్టర్ల వారిగా రైతు వేదికలలో అవగాహన సదస్సులు నిర్వహించను న్నాం. కొనుగోళ్లకు లాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.
సబావత్ మోతీలాల్, అదనపు కలెక్టర్, మంచిర్యాల