టైటాన్ సబ్‌మెరైన్ ప్రమాదంలో చివరి మాటలు
న్యూయార్క్, సెప్టెంబర్ 17: వందేండ్ల కింద అట్లాంటిక్ మహా సముద్రంలో మునిగిన టైటానిక్ నౌకను చూసేందుకు వెళ్లిన టైటాన్ సబ్‌మెరైన్ నీటమునిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో అందు లో ఉన్న 5మంది ప్రాణాలు కోల్పోయారు. గతేడాది జూన్‌లో జరి గిన ఈ ఘటనపై తాజాగా న్యాయ విచారణ ప్రారంభమైంది. ఈ క్రమంలో ‘అంతా బాగానే ఉంది’ అనే మూడు పదాలు సబ్‌మె రైన్‌లో ఉన్నవారి నుంచి చివరగా వినిపించినట్లు తెలిసింది. ప్రమా దానికి సంబంధించిన ఫొటో కూడా బయటికి వచ్చింది.
ఓ రిమోట్ ఆపరేటెడ్ వెహికల్ ఈ చిత్రాన్ని తీసింది. 2023, జూన్‌లో టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు బయల్దేరిన టైటాన్ రెండు గంటల్లోనే ప్రమాదానికి గురైంది. ప్రమాదంలో వాస్తవాలను వెలికితీసి.. మున్ముందు ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు అమెరికా కోస్ట్‌గార్డ్ అధికారులు సోమవారం విచారణను ప్రారంభించారు.ఈ సందర్భంగా టైటాన్ యాత్ర రీక్రియేషన్ చేశారు. దీనిలో ఈ జలాంతర్గామి నుంచి వచ్చిన టెక్ట్స్ మెసేజ్‌లు, పోలార్ ప్రిన్స్ మదర్ షిప్ నుంచి విడిపోవడం లాంటివి ఉన్నాయి.