13-03-2025 12:56:00 AM
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చి 12 (విజయక్రాంతి): గవర్నర్ ప్రసంగంలో కొత్తేదేమి లేదని, అబద్ధాలను అందమైన భాషలో చెప్పారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. బుధవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత ఆమె మీడియాతో మాట్లాడారు.. గవర్నర్ ప్రసంగాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
గాంధీ కుటుంబం సంతకాలు చేసిన గ్యారెంటీలను చూసే ప్రజలు ఓట్లేశారని, స్థానిక కాంగ్రెస్ నాయకులను చూ సి ప్రజలు ఓట్లు వేయలేదన్నారు. గాంధీ కుటుంబానికి కేవలం ఎన్నికల సమయంలోనే తెలంగాణ గుర్తొ స్తుందా? అని ప్రశ్నిం చారు. మహిళలకు నెలకు రూ.2,500 ఇస్తామన్న హామీని విస్మరించిందన్నారు.
ఇక్కడి ప్రభుత్వం విఫలమవుతున్న నేపథ్యంలో గాంధీ కుటుంబం హామీలను అమలుచేసే బాధ్యతను తీసుకోవాలన్నారు. ఎన్నికల హామీల విషయంలో గాంధీ కుటుం బం తెలంగాణ ప్రజలకు జవాబు సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఎండగడుతామని, రూ.లక్షా 50 వేల కోట్ల అప్పులు చేసి నా ప్రభుత్వం ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయలేదని మండిపడ్డారు.