దీపావళి శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్
హైదరాబాద్, అక్టోబర్ 30 (విజయక్రాంతి): రాష్ట్ర ప్రజలకు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఈ దీపావళి అందరి జీవితాల్లో వెలుగులు నిం పాలని ఆకాంక్షించారు. చెడుపై ధర్మం సా ధించిన విజయాన్ని ఈ పండుగ సూచిస్తుందన్నారు. ఆత్మనిర్భర్ స్ఫూర్తితో స్వదేశీ త యారీదారుల జీవితాల్లో కొత్త వెలుగులు తీ సుకొచ్చేందుకు స్థానిక ఉత్పత్తులను కొనుగో లు చేయాలని విజ్ఞప్తి చేశారు. అందరి ఇళ్లలో సుఖఃసంతోషాలు నింపాలని కోరారు.
చీకట్లు తొలగిపోయాయి: రేవంత్‌రెడ్డి
రాష్ర్ట ప్రజలకు సీఎం రేవంత్‌రెడ్డి దీపావ ళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పదేం డ్ల విధ్వంసపు పాలనలోని చీకట్లు తొలగిపోయాయని, ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ప్రజాపాలనలో తెలంగాణ వెలుగు లు విరజిమ్ము తుందని ధీమా వ్యక్తం చేశా రు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే ఈ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకోవాలన్నారు.
దీపా ల కాంతులతో ప్రతి ఇంటింటా సుఖసంతోషాలు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. ప్రజ లకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దీపావళి ప్రతి ఒక్కరి జీవితంలో వెలుగును ఇవ్వాలని కోరుకున్నారు. కాగా మంత్రులు శ్రీధర్‌బాబు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కొండా సురేఖ, సీతక్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.