calender_icon.png 13 April, 2025 | 9:29 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరూ సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలి

12-04-2025 10:29:17 PM

మోతే: అర్హతలు ఉన్న ప్రతి ఒక్కరు ప్రభుత్వం ద్వారా వస్తున్న సంక్షేమ పథకాలను వినియోగించుకోవాలని కోదాడ ఎమ్మెల్యే ఉత్తం పద్మావతి రెడ్డి అన్నారు. శనివారం మోతే మండల రెవెన్యూ కార్యాలయంలో కల్యాణ లక్ష్మి షాది ముబారక్ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేసి మాట్లాడారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరికి పథకాలు అందేలా అధికారులు చూడాలని కోరారు. అక్రమాలకు తావు లేకుండా పథకాలు అందేలా అన్ని శాఖల అధికారులు తోడ్పాటు అందించాలన్నారు.

అనంతరం జిల్లా స్థాయిలో జిల్లా స్థాయి గ్రామపంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను బిక్య తండాలో ప్రారంభించి మాట్లాడారు క్రీడలు మానసికంగా ఎంతో తోడ్పాటు అందిస్తాయన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలను ప్రోత్సహించాలి క్రీడాకారులను పరిచయం చేసుకొని మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రతి పథకం కార్యకర్తలు ప్రజలకు అందేలా చూడాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తాసిల్దార్ శ్రీకాంత్, ఎంపీడీవో ఆంజనేయులు, వివిధ శాఖల అధికారులు మాజీ జెడ్పిటిసి బానోతు మాతృనాయక్, మండల అధ్యక్షుడు కీసర సంతోష్ రెడ్డి, నాయకులు ముదిరెడ్డి మధుసూదన్ రెడ్డి, వివిధ గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.