20-03-2025 12:12:57 AM
వికారాబాద్, మార్చి 19: 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకునే విధంగా వారిలో అవగాహన కల్పించాలని జిల్లా అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్ లోని అదనపు కలెక్టర్ తన ఛాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్లుగా నమోదు, మార్పులు చేర్పులు, బూ తు స్థాయి ఏజెంట్ల నియామకం, ఎన్నికల్లో పోటీచేసిన అభ్యర్థుల ఖర్చుల సమర్పన తదితర అంశాలపై అదనపు కలెక్టర్లు కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... యువతలో ఓటు ప్రాముఖ్యతను కలిగి ఉండేవిధంగా 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఫారం 6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు.ఓటరుగా నమోదు చేసుకోవడం నిరంతర ప్రక్రియ అని తెలిపారు.
మీసేవ, ఆన్ లైన్ , హెల్ప్ లైన్, మొబైల్ ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. ఫారం 7 ద్వారా మార్పులు చేర్పు లు చేసుకోవచ్చని అదేవిధంగా ఫారం 8 ద్వారా ఓటరు బదిలీ, పోలింగ్ కేంద్రం బదిలీ, కుటుంబ సభ్యులు ఒకే పోలింగ్ కేంద్రానికి మార్చుకోవడం, ఓటరు ఐడీలో మార్పులు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.