calender_icon.png 1 February, 2025 | 9:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుష్ట్టు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

31-01-2025 01:22:48 AM

జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల, జనవరి 30 ( విజయక్రాంతి ) :  మహాత్మా గాంధీ ఆశయం మేరకు కుష్ట వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరు కషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ అన్నారు. మహాత్మా గాంధీ వర్ధంతి, అమర వీరుల స్మారక దినోత్సవంలో భాగంగా గురువారం కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో కలిసి రెండు నిమిషాలు మౌనం పాటించా రు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహాత్మా గాంధీ ఆశయాల మేరకు కుష్టు బాధితులకు వివక్ష లేకుండా ప్రేమతో సేవ చేయాలని, సమాజంలో వ్యాధిపై అపోహల ను తొలగించి అవగాహన పెంచాలని అన్నారు. 

మహాత్మా గాంధీ ఆశయాలను గౌరవి స్తూ, కుష్టు వ్యాధి బాధితులకు మద్దతుగా, వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కషి చేయడానికి ప్రతిజ్ఞ గావించారు. మహాత్మా గాంధీ కలలు కన్న విధంగా భవిష్యత్తులో కుష్టు వ్యాధి రహిత భారతదేశ నిర్మాణానికి ప్రతి ఒక్కరు కషి చేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు లక్ష్మీనారా యణ, నర్సింగ రావు, జిల్లా వైద్య అధికారి సిద్ధప్ప, ఏ.ఓ వీరభద్రప్ప, జిల్లా అధికారులు, కలెక్టర్ కార్యాలయం సిబ్బంది పాల్గొన్నారు.