19-04-2025 09:46:48 PM
రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పి. బాల కిష్టారెడ్డి...
కడ్తాల్: ప్రస్తుతం భూమి మీద ప్రతి ఒక్కటి కలుషిత అవుతుందని వాటి నివారణ కోసం పర్యావరణ పరిరక్షణ చాలా అవసరమని పర్యావరణాన్ని రక్షించే బాధ్యత నవతర సైనికులు విద్యార్థులేనని ఉన్నత విద్యా మండలి చైర్మన్ పి బాల కిష్టారెడ్డి అన్నారు. శనివారం కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా యూత్ లీడర్స్ కంక్లూ ఫర్ బెటర్ సెంటర్ ....యూత్ లీడర్ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి సుమారు 500 మంది యూనివర్సిటీ విద్యార్థులు భాగస్వాములై.. సుమారు వందమంది అధ్యాపకులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ చైర్మన్ లీలా లక్ష్మారెడ్డి అధ్యక్షతన అన్మాస్పల్లి ఎర్త్ సెంటర్లో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ ఉన్నత విద్యా మండలి చైర్మన్ పి. బాల కిష్టారెడ్డి పాల్గొని మాట్లాడుతూ... కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ సమాజ శ్రేయస్సు కోరే ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి పుడమి తల్లి సేవ చేయడానికి 15సంవత్సరాలుగా నిర్విరామంగా చేస్తున్న సేవలను కొనియాడారు. పర్యావరణాన్ని కాపాడవలసిన బాధ్యత అందరి పైన ఉంది ఉన్నత విద్యలో భాగంగా పర్యావరణం పైన సరైన సిలబస్ను కూర్పు చేసి ఉన్నత విద్యలో ప్రవేశపెడతామని సీజిఆర్ ఇచ్చిన సూచనలు పాటిస్తామని ఉన్నత విద్యలో ఉన్న అవకాశాలన్నీ వినియోగించుకొని పర్యావరణాన్ని కాపాడుతామని ఆయన అన్నారు.
లీలా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రజల ఆలోచన విధానం పైనే ఈ సమాజం ఆధారపడి ఉంటుందని అన్నారు. మన చుట్టూ ఉండే చెట్లని మాత్రమే ఎదగనివ్వాలి బయటి వంటి ఇతర దేశాలు చెట్లు ఇక్కడ ఎదగలేవు సహజమైన జైలు కరిగిపోతున్నాయి కాబట్టి సహజ సంపదను మనము కాపాడుకోవాలి అని సందేశించారు, వందేమాతరం ఫౌండేషన్ రవీందర్ మాట్లాడుతూ మనం సంపాదించుకున్న డిగ్రీలు ఆస్తి బంగారం మనకు కావలసిన సమయంలో లేనప్పుడు పర్యావరణం మనతో ఉంటుందని అన్నారు.
సీనియర్ జర్నలిస్ట్ ఫార్మర్ ఆర్టిఏ కమిషనర్ దిలీప్ రెడ్డి మాట్లాడుతూ 15 సంవత్సరాలుగా సిజిఆర్ తో అనుబంధం ఉంది కానీ ఈరోజు యువతని చూస్తుంటే పర్యావరణాన్ని కాపాడడానికి ముందుకు వచ్చినందుకు సంతోషంగా ఉందని అన్నారు. ప్రొఫెసర్ పురుషోత్త రెడ్డి మాట్లాడుతూ పర్యావరణం కాపాడడం కోసం అందరు బాధ్యతగా తీసుకోవాలని గుర్తు చేశారు.
కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్ ఫౌండర్ లక్ష్మారెడ్డి మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ ఈరోజు వందల మంది యువకులతో పర్యావరణానికి నడుంబిగించినందుకు వారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని మనసు పులకించిపోతుందని తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు డాక్టర్ నవీన్ రావు, డాక్టర్ జి. ఎన్ జగన్, డాక్టర్ ప్రియ మేడం, డాక్టర్ వసంత లక్ష్మి, వివిధ పర్యావరణ వేత్తలు పాల్గొన్నారు.