calender_icon.png 19 March, 2025 | 10:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అటల్‌జీ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

18-03-2025 01:45:09 AM

యాదాద్రి భువనగిరి, మార్చి 17 (విజయక్రాంతి): మాజీ ప్రధాని భారతరత్న  అటల్ బిహారీ వాజ్ పాయ్ జి  శత జయంతి ఉత్సవాలు బిజెపి జిల్లా కార్యాలయం లో జిల్లా కన్వీనర్ బడుగు జాంగిర్ గారి అధ్యక్షతన  నిర్వహించారు.  ముఖ్య అతిథిగా అటల్ బిహారీ శతజయంతి ఉత్సవాల ఉమ్మడి జిల్లా ఇంచార్జ్ బిజెపి రాష్ట్ర కార్యదర్శి ఆకుల విజయ  మాట్లాడుతూ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రాంతంలో అటల్ జి జీవిత కాలంలో ఈ ప్రాంతంలో ఎక్కడెక్కడ సందర్శించారు.

జ్ఞాపకాలను సేకరిస్తూ, కవులు కళాకారులు మరియు ఆర్మీలో పని చేసినటువంటి వ్యక్తులను గుర్తించి కార్యక్రమంలో పాల్గొని విధంగా చేయాలని అన్నారు  అటల్ జి  దేశానికి ఎంతో సేవ చేశారని  ప్రధానిగా ప్రవేశపెట్టిన ప్రతి  ప్రతి పథకం నిరుపేదలకు చేరిందని  ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన పేరుతో ప్రతి గ్రామ గ్రామానికి రోడ్లు గ్రామపంచాయతీ భవనాలు నిర్మించడం స్వర్ణ చతుర్భుజి మెగా హైవేలు గ్రామాలు అభివృద్ధి జరిగిందని అని  అన్నారు.

అనంతరం అటల్ జీతో కలిసి గతంలో పనిచేసిన  వారిని  కలవడంలో భాగంగా పులిమామిడి బాలకృష్ణా రెడ్డి, చందా ఈశ్వర్ గుప్తా, సుదగాని శ్రీశైలం,  గార్లను మరియు చందుపట్ల రాంగోపాల్రావు , రంగా రాములు వారి కుటుంబ సభ్యులను వారి వారి ఇంటి దగ్గర కలిసి గత జ్ఞాపకాలు గుర్తు చేసుకుని సన్మానించారు.

ఈ కార్యక్రమంలో అటల్ బిహారీ వాజ్ పాయ్ జయంతి ఉత్సవ ల కో కన్వీనర్ లు పట్నం కపిల్, కొప్పుల యాదిరెడ్డి, కే లక్ష్మీనారాయణ, కానుకుంట్ల రమేష్, బిజెపి మాజీ జిల్లా అధ్యక్షులు పాశం భాస్కర్, బిజెపి రాష్ట్ర నాయకులు పోతంశెట్టి రవీందర్, వట్టు పల్లి శ్రీనివాస్ గౌడ్, పడాల శ్రీనివాస్, నల్ల నర్సింగ్ రావు, పట్నం రోజా శ్రీనివాస్, చంద మహేందర్ గుప్తా, సూరి లావణ్య శ్రీనివాస్, చందుపట్ల వెంకటేశ్వరరావు, రత్నపురం బలరాం , రామ గౌడ్, జనపల్లి శ్యాంసుందర్, కాసాని శ్రీనివాస్, రత్నపురం శ్రీశైలం, లింగస్వామి, శ్రీకాంత్, ప్రవీణ్, ఆనంద్, మంగు నరసింహారావు, భాస్కర్ పాల్గొన్నారు.