calender_icon.png 16 April, 2025 | 3:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి

14-04-2025 06:18:40 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని తాండూరు మండల బిజెపి అధ్యక్షులు దూడపాక భరత్ కుమార్ అన్నారు. సోమవారం అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా తాండూర్ ఐబి, మాదారం లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. భారతీయ జనతా పార్టీ పిలుపుమేరకు భారత రాజ్యాంగ పీఠికను చదివి ప్రమాణం చేశారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొయ్యల ఏమాజీ, బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు, ఫుడ్ కార్పొరేషన్ సభ్యులు పులగం తిరుపతి, జిల్లా అధికార ప్రతినిధి చిలుముల శ్రీకృష్ణదేవరాయలు, ఎస్సీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి పగిడి చిరంజీవి, బిజెపి సీనియర్ నాయకులు యంగర్ తుకారం, ఎస్సీ మోర్చా జిల్లా కార్యదర్శి కల్లేపల్లి నవీన్, ఎస్సీ మూర్తి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎరుకల నర్సింగ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రావణ్, మహిళా మోర్చా జిల్లా ఉపాధ్యక్షురాలు సంఘర్ష సీతల్, మండల ప్రధాన కార్యదర్శి పుట్ట కుమార్, మండల ఉపాధ్యక్షులు చొక్కాల నాగభూషణ్, మండల నాయకులు తుపాకుల చంద్రయ్య, ఎలిగేటి నరేష్, ఆనంద్, గోపికృష్ణ, రాహుల్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.