23-03-2025 08:09:44 PM
ఎమ్మెల్యే వినోద్...
బెల్లంపల్లి (విజయక్రాంతి): టీబీ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో క్షయ వ్యాధి అవగాహనకు సంబంధించిన ప్రచార పోస్టర్లను ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ... బాదితుల్లో క్షయ లక్షణాలు నిర్ధారణ అయిన వెంటనే చికిత్సను ప్రారంభించాలని వైద్య సిబ్బందికి తెలిపారు. క్షయ వ్యాధి పట్ల ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేలా కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. బెల్లంపల్లి నియోజకవర్గంను క్షయరహిత నియోజకవర్గంగా చేసేందుకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎన్‌టిఇపి సిబ్బంది, సీనియర్ ట్రీట్మెంట్ సూపర్‌వైజర్ శ్రీపెల్లీ శషికాంత్, హెల్త్ విజిటర్ గంగాబోయిన వెంకటేష్, ల్యాబ్ టెక్నీషియన్ దేశమని చెన్న కేశవులు, బెల్లంపల్లి టీబీ యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.