26-04-2025 05:13:59 PM
జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్..
ఆదిలాబాద్ (విజయక్రాంతి): ప్రతి మతంలో తప్పనిసరిగా వాళ్ల సాంప్రదాయం ప్రకారంగా పూజారులతోనే పెళ్లి జరిపిస్తుంటారని కచ్చితంగా అమ్మాయి, అబ్బాయి వయసును నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని జిల్లా బాలల సంరక్షణ అధికారి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. శనివారం ఆదిలాబాద్ లోని విద్యానగర్ లో గల బాల్ రక్షక్ భవనంలో షూర్ ఎన్జీవో ఆధ్వర్యంలో పురోహితులకు, మౌలానా ఖాజీ, చర్చి పాస్టర్లకు ఈ నెల 30 అక్షయ తృతీయ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంరక్షణ అధికారి రాజేంద్రప్రసాద్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకట్ స్వామి లు హాజరయ్యారు. అనంతరం షూర్ ఎన్జీవో ముద్రించిన బాల్య వివాహ చట్టం, శిక్షలు జరిమానాలకు సంబంధించిన కరపత్రాలను సభ్యులు విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు దశరథ్, డేవిడ్, చైల్డ్ హెల్ప్ లైన్ జిల్లా కోఆర్డినేటర్ సతీష్, పిఓఐసి స్వామి, షూర్ ఎన్జీవో ప్రతినిధి కె. వినోద్, పురోహితులు, మౌలానలు, చర్చి పాస్టర్ లు పాల్గొన్నారు.