calender_icon.png 18 April, 2025 | 10:37 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూగర్భజలాల సంరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి

15-04-2025 09:59:29 PM

జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగువన్..

కామారెడ్డి (విజయక్రాంతి): భూగర్భజలాల సంరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అసిస్ సంఘం అన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో భూగర్భజలాల సంరక్షణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో భూగర్భ జలాలు చాలా వేగంగా పడిపోతున్నాయి, రాబోయే ఎండాకాలంలో భూగర్బజలాల సంరక్షణ కోసం ఫాం పాండ్స్, బోరేవెల్ రీఛార్జ్ స్ట్రక్చర్, ఇంకుడు గుంతలు, సోక్ పిట్స్ ఎక్కువ నిర్మించాలని అన్నారు. వచ్చే వర్షకాలంలో ప్రతి వర్షపు నీటి చుక్కను ఒడిసి పట్టి భూమిలోకి ఇంకేలాగా దానికి తగిన విధంగా యాక్షన్ ప్లాన్ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టరు చందర్ నాయక్, జిల్లా భూగర్భ జల అధికారి సతీష్ యాదవ్, పీడీ సురేందర్, రాజేందర్ రెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి తిరుమల ప్రసాద్, జిల్లా ఉద్యాన అధికారిణి జ్యోతి, పలుశాఖల అధికారులు పాల్గొన్నారు.