calender_icon.png 15 November, 2024 | 12:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలి

14-11-2024 01:48:09 PM

జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్

గద్వాల టౌన్ : నేటి పిల్లలను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దడంలో ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ అన్నారు. చిల్డ్రన్స్ డే సందర్భంగా గురువారం జిల్లా కేంద్రంలోని బాల సదనంలో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ అధ్వర్యంలో ఏర్పాటు చేసిన జాతీయ బాలల దినోత్సవం కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితా దేవితో కలిసి జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి, జవహర్ లాల్ నెహ్రూ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత తొలి ప్రధాన మంత్రి జవహర్ లాల్ నెహ్రూ జన్మదినం సందర్భంగా బాలల దినోత్సవాన్ని జరుపుకోవడం విశేషమని అన్నారు.

అన్ని సామాజిక వర్గాల పిల్లలందరికీ సమాన విద్య అందించడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని అన్నారు.పిల్లల అభ్యాసం, వారి సమగ్ర అభివృద్ధికి బాల సధాన్ మంచి గుణాత్మక విద్యతో పాటు,వివిధ కార్యక్రమాలు అందిస్తోందని తెలిపారు. పిల్లలకు పౌష్టికాహారం, వ్యక్తిగత శ్రద్ధ వంటి సౌకర్యాలు అందుబాటులో ఉంచుతూ,ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఉత్తమ పౌరులుగా ఎదగాలని సూచించారు. "ఇవాళ్టి పిల్లలు రేపటి పౌరులు” అని పేర్కొంటూ, పిల్లలు బాగా చదివి జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి గంటా కవితా దేవి,  శిశు సంక్షేమ శాఖ అదికారి  సుధారాణి, సి. డబ్ల్యూ. సి. చైర్మన్ సహదేవులు, సభ్యురాలు శైలజ, కోఆర్డినేటర్ నరసింహ తదితరులు పాల్గొన్నారు.